బ‌న్నీకి 6… బెల్లంకొండ‌కు 12

డిమాండ్ సప్లై.. ఈ ఎక‌నామిక్స్ సూత్రం చిత్ర‌సీమని చాలా బాగా అర్థం చేసుకొంది. డిమాండ్‌ని బ‌ట్టే… పారితోషికం గుంజుళ్లుంటాయ్ ఇక్క‌డ‌. హీరోని బ‌ట్టి, చిత్ర నిర్మాణ సంస్థ‌ని బ‌ట్టి, ప్ర‌స్తుతం ఉన్న ఫామ్‌ని బ‌ట్టి పారితోషికాల్లో మార్పులూ వ‌స్తుంటాయ్‌. తాజాగా బోయ‌పాటి శ్రీ‌ను అందుకొన్న పారితోషిక‌మే దీనికి అతి పెద్ద ఉదాహ‌ర‌ణ‌. ద‌మ్ము సినిమా ఫ్లాఫ్ అవ్వ‌డంతో.. బోయ‌పాటికి లెజెండ్ ద్వారా రూ.5 కోట్లు మాత్ర‌మే పారితోషికం అందుకొన్నాడు. ఆ సినిమా హిట్ట‌వ్వ‌డంతో.. బోయ‌పాటి రేంజు పెరిగింది. అయితే గీతా ఆర్ట్స్ మాత్రం స‌రైనోడు కోసం బోయ‌పాటికి రూ.6 కోట్ల పారితోషికం ముట్ట‌జెప్పిన‌ట్టు తెలుస్తోంది. హీరో బ‌న్నీ కావ‌డంతో, ఈ సినిమా హిట్ట‌యితే త‌న మైలేజీ మ‌రో స్థాయిలో ఉంటుంద‌ని ఊహించిన బోయ‌పాటి.. రూ.6 కోట్ల‌కు ఓకే అనేశాడు.

అదే స‌మ‌యంలో బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో సినిమా చేస్తాన‌ని బోయ‌పాటి మాటిచ్చాడు. అడ్వాన్సూ అందుకొన్నాడు. అయితే ఆ సినిమా కోసం బోయ‌పాటి అందుకొన్న పారితోషికం అక్ష‌రాలా రూ.12 కోట్లు. అంత పారితోషికం ఇస్తున్నారు కాబ‌ట్టే కొత్త కుర్రాడైనా స‌రే.. శ్రీ‌నివాస్ తో సినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడు. అందులో రూ.5 కోట్లు ఇప్ప‌టికే అడ్వాన్సు రూపంలో బోయ‌పాటికి అందేశాయి. అందుకే.. కేవ‌లం పారితోషికం కోసం.. శ్రీ‌నివాస్‌తో సినిమా చేయ‌డానికి బోయ‌పాటి ఒప్పుకొన్నాడు. అదీ.. బెల్లంకొండ సినిమా మేట‌రు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close