వెన‌క‌డుగు వేసిన బోయ‌పాటి?

నంద‌మూరి బాల‌కృష్ణ – బోయ‌పాటి కాంబినేష‌న్ లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. లాక్ డౌన్ వ‌ల్ల షూటింగ్ ఆగిపోయింది గానీ, లేదంటే ఈ పాటికి ఫ‌స్ట్ లుక్ సైతం బ‌య‌ట‌కు వ‌చ్చేసేది. ఈ సినిమా మొద‌లవ్వ‌కుండా స్టోరీ లైన్ కూడా లీకైంది. బాల‌కృష్ణ రెండు విభిన్న‌మైన గెట‌ప్పుల్లో క‌నిపిస్తార‌ని, అందులో అఘోరా గెట‌ప్ ఒక‌ట‌ని ప్ర‌చారం జ‌రిగింది. అది నిజం కూడా. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ముందు బాల‌య్య అఘోరా గెట‌ప్‌కి సంబంధించిన స‌న్నివేశాలు మొద‌ల‌వుతాయి. ద్వితీయార్థం లో దాదాపు స‌గం వ‌ర‌కూ క‌థ అఘోరా గెట‌ప్ చుట్టూనే తిరుగుతుంది. బాల‌య్య‌కి ఆ గెట‌ప్ సెట్ అవుతుందా, లేదా? అఘోరాగా బాల‌య్య‌ని చూడ‌గ‌ల‌మా, లేదా? అంటూ స్వ‌యంగా బాల‌య్య ఫ్యాన్సే ఆందోళ‌న చెందారు. గెట‌ప్ ఏమాత్రం తేడా కొట్టినా మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని భ‌య‌ప‌డ్డారు. ఈ సంగ‌తి చిత్ర‌బృందం వ‌ర‌కూ వెళ్లింది. ఈ విష‌య‌మై ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు. చివ‌రికి అఘోరా గెట‌ప్‌కి సంధించిన స‌న్నివేశాల నిడివి త‌గ్గించాల‌న్న నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది.

అఘోరాకి సంబంధించిన ఎపిసోడ్ వీలైనంత వ‌ర‌కూ కుదించార‌ని స‌మాచారం. ఆ గెట‌ప్‌కూడా ముందుగానే రివీల్ చేసి, బాల‌య్య ఫ్యాన్స్‌ని ప్రిపేర్ చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. లాక్ డౌన్ ఇబ్బంది లేక‌పోతే ద‌స‌రాకి ఈ సినిమా రావాల్సింది. షూటింగ్ ఎప్పుడు మొదలైనా, ద‌స‌రాకే ఈ సినిమాని తీసుకొస్తామ‌ని ద‌ర్శ‌కుడు బోయ‌పాటి గ‌ట్టిగా చెబుతున్నారు. అటూ ఇటూ అయితే గ‌నుక‌.. సంక్రాంతి రేసులో ఈ సినిమాని చూడొచ్చు. సంక్రాంతి బాల‌య్య‌కు అచ్చొచ్చిన సీజ‌న్‌. కాబ‌ట్టి.. ఆ సెంటిమెంట్ కూడా బాల‌య్య‌కు క‌లిసొచ్చే ఛాన్సుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close