ఇది ప‌క్కా: రామ్‌చ‌ర‌ణ్ తో బోయ‌పాటి

జ‌య జాన‌కి నాయ‌క త‌ర‌వాత బోయ‌పాటి శ్రీ‌ను సినిమా ఎవ‌రితో అనేది స‌స్పెన్స్‌గా మారింది. అఖిల్‌తో ఓ సినిమా చేసే ఛాన్స్ వ‌చ్చింది బోయ‌పాటికి. బాల‌కృష్ణ‌తో సినిమా కూడా లైన్‌లో ఉంది. బాల‌య్య‌తో సినిమా చేసే లోపు బోయ‌పాటి మ‌రో సినిమా చేస్తాడా, లేదా?? అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే… బాల‌య్య‌తో సినిమా మొల‌య్యేలోగా ఓ సినిమా పూర్తి చేయాల‌ని బోయ‌పాటి ఫిక్స‌య్యాడ‌ట‌. అయితే ఆ సినిమా అఖిల్‌తో కాదు. రామ్ చ‌ర‌ణ్‌తో చేయ‌బోతున్న‌ట్టు టాక్‌. డి.వి.వి దాన‌య్య అటు చ‌ర‌ణ్‌కీ, ఇటు బోయ‌పాటికీ అడ్వాన్సులు ఇది వ‌ర‌కే ఇచ్చేశాడు. ఆయ‌న ప్రోగ్బ‌లంతోనే ఈ ప్రాజెక్టు ఓకే అయ్యింద‌ని తెలుస్తోంది. చిరు 152వ సినిమాకీ బోయ‌పాటినే ద‌ర్శ‌కుడు. ముందు చ‌ర‌ణ్‌తో సినిమా పూర్తి చేసి, ఆ త‌ర‌వాత బాల‌య్య‌తో సినిమా ప‌ట్టాలెక్కిస్తాడు. ఇవి రెండూ పూర్త‌యిన త‌ర‌వాతే, చిరుతో సినిమా ఉంటుంది. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్‌కి సంబంధించిన స్క్రిప్టు ప‌నులు ముమ్మ‌రంగా సాగుతున్నాయని, త్వ‌ర‌లోనే ఈ కాంబోపై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రావొచ్చ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.