బోయ‌పాటికి ప‌వ‌న్ కావాల‌ట‌!

జ‌య‌జాన‌కి నాయ‌క త‌ర‌వాత బోయ‌పాటి శ్రీ‌ను సినిమా ఎవ‌రితో అనే ప్ర‌శ్న‌కు ఇంకా స‌మాధానం దొర‌క‌లేదు. అఖిల్ లైన్‌లో బోయ‌పాటి ఇంకా బెట‌ర్ ఆప్ష‌న్ కోసం ఎదురుచూస్తున్న‌ట్టు టాక్‌. బోయ‌పాటితో సినిమా చేయ‌డానికి తాజాగా మైత్రీ మూవీస్ సంస్థ ప్ర‌య‌త్నిస్తోంది. ఇందుకు సంబంధించి చ‌ర్చ‌లు కూడా మొద‌ల‌య్యాయి. అయితే బోయ‌పాటి మాత్రం `నాకు పెద్ద హీరోని తీసుకొస్తారా` అని అడిగిన‌ట్టు తెలుస్తోంది. బోయ‌పాటితో సినిమా అంటే స్టార్లు సిద్ధంగానే ఉంటారు. కాక‌పోతే.. ఇప్పుడు మాత్రం వాళ్లంతా బిజీ. మ‌హేష్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, ప్ర‌భాస్‌.. వీళ్ల‌తో సినిమా అంటే టైమ్ ప‌ట్టేసేట్టు ఉంది. 2018 మేలో.. బాల‌య్య సినిమాని మొద‌లెడ‌తాడు బోయ‌పాటి. ఈలోగా మ‌రో సినిమా, అదీ పెద్ద హీరోతోనే చేయాల‌ని ఫిక్స‌య్యాడ‌ట‌. బోయ‌పాటి దృష్టి ప‌వ‌న్ క‌ల్యాణ్‌వైపు ఉంద‌ని తెలుస్తోంది. ఎందుకంటే మైత్రీ మూవీస్ ద‌గ్గ‌ర ప‌వ‌న్ డేట్లు ఉన్నాయి. త్రివిక్ర‌మ్ త‌ర‌వాత ఆ సంస్థ‌లోనే సినిమా చేయాలి ప‌వ‌న్‌. కందిరీగ ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీ‌నివాస్ – ప‌వ‌న్ కాంబో సెట్ చేసింది మైత్రీ. ఇప్పుడు బోయ‌పాటి రంగంలోకి దిగితే.. ఈ కాంబినేష‌న్ మారే అవ‌కాశాలున్నాయి. సంతోష్ శ్రీ‌నివాస్ కంటే.. బోయ‌పాటి బెట‌ర్ ఆప్ష‌న్‌. ప‌వ‌న్ – బోయ‌పాటి సినిమా అంటే ఆ రేంజే వేరుగా ఉంటుంది. సో.. మైత్రీ మూవీస్ కూడా ఈ విష‌యంలో పున‌రాలోచ‌న‌లో ప‌డింద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com