యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎందుకు విడిపోతోంది?

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవాలని నిర్ణయించుకొంది. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ తో సహా ఆ దేశంలో 48.2 శాతం మంది ప్రజలు విడిపోకూడదని కోరుకొన్నారు. కానీ దేశంలో 51.8 శాతం మంది ప్రజలు విడిపోవాలని కోరుకోవడంతో విడిపోవడం అనివార్యం అయ్యింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవాలని అనుకోగానే అందరూ అడిగే ప్రశ్న ‘ఎందుకు’ అని! దానికి అనేక బలమైన కారణాలున్నాయి. వాటిలో కొన్ని:

  • బ్రిటన్ లో అధికారంలోకి వచ్చిన కన్సర్వేటివ్ పార్టీ మొదటి నుంచి యూరోపియన్ యూనియన్ పట్ల ఎంతో కొంత విముఖత చూపిస్తూనే ఉంది. అదే పార్టీకి చెందిన బ్రిటన్ ప్రధాని డేవిడ్ కమరూన్ విడిపోకూడదని గట్టిగా కోరుకొంటునప్పటికీ ఆయన పార్టీ, ప్రజలు కూడా విడిపోవాలని కోరుకోవడంతో వారి నిర్ణయాన్ని అంగీకరించక తప్పలేదు.
  • యూరపియన్ యూనియన్ లో సభ్యులుగా ఉన్న బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర అభివృద్ధి చెందిన దేశాలు, యూరోప్ లో పేద దేశాల అభివృద్ధి కోసం ప్రతీ ఏటా భారీగా నిధులు కేటాయిస్తుంటాయి. వాటిలో బ్రిటన్ ఆర్ధికంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే బ్రిటన్ వాటాగా చాలా ఎక్కువ చెల్లించవలసి వస్తోంది. ఆ కారణంగా యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం బ్రిటన్ కి గుది బండగా మారిందని బ్రిటన్ లో చాలా మంది భావించడం ఒక కారణం.
  • యూరోపియన్ యూనియన్ లో బ్రిటన్ సభ్యత్వం కారణంగా చైనా వంటి వేరే దేశాలతో బ్రిటన్ వర్తక, వాణిజ్య సంబంధాలకి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆ కారణంగా బ్రిటన్ కి బారీగా ఆర్ధిక నష్టం కలుగుతోందని కొందరు వాదిస్తున్నారు. కానీ గత ఆర్ధిక సంవత్సరంలో బ్రిటన్ సుమారు 14.9 బిలియన్ పౌండ్లు చైనాకి ఎగుమతులు చేయగా, దానికి 5 రెట్లు అంటే 74.5 శాతం జర్మనీ ఎగుమతి చేసింది. కనుక ఈ విషయంలో బ్రిటన్ వాదన సరికాదని సభ్యదేశాలు వాదిస్తున్నాయి.
  • యూరోపియన్ దేశాలలో ఎవరు ఎక్కడైనా స్వేచ్చగా పని చేసుకొనే విధానం వలన బ్రిటన్ యువతలో నిరుద్యోగ సమస్యని ఎదుర్కొంటున్నారు. ఇది మరో ప్రధాన కారణం. సోవియట్ రష్యా విచ్చినం అయిన తరువాత దాని నుంచి విడిపోయి స్వతంత్రం పొందిన కొన్ని చిన్నదేశాలు యూరోపియన్ యూనియన్ లో సభ్యదేశాలుగా చేరాయి. ఆ దేశాలకి ఈ స్వేచ్చాయుత ఉద్యోగ సౌకర్యం చాలా లాభం కలిగించింది. యూరోపియన్ యూనియన్ లో ఉన్న పేద దేశాలలో ప్రజలు సహజంగానే మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఆర్ధికంగా బలంగా ఉన్న బ్రిటన్ కి బారీగా తరలివస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం బ్రిటన్ లోకి ఆవిధంగా వచ్చినవారి సంఖ్య 14 లక్షలని తేలింది. అంటే 14లక్షల మంది బ్రిటన్ యువత ఉద్యోగాలు కోల్పోయారన్న మాట! పైగా చిన్న చిన్నఉద్యోగాల కోసం కూడా బ్రిటన్ యువత వారితో పోటీ పడవలసి వస్తోంది. తక్కువ జీతంతో ఎక్కువ పనిచేసే భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఫిలిపిన్ దేశస్థుల పట్ల గల్ఫ్ దేశాలు ఏవిధంగా ఆసక్తి చూపుతున్నాయో అదేవిధంగా బ్రిటన్ లో సంస్థలు కూడా విదేశీయులకే ప్రాధాన్యం ఇవ్వడంతో బ్రిటన్ యువతలో నిరుద్యోగం, దానితో బాటే వారిలో ఆగ్రహం ఆ కారణంగా సమాజంలో అశాంతి క్రమంగా పెరగడం మొదలైంది. ఇది అన్నిటి కంటే బలమైన కారణంగా చెప్పుకోవచ్చు.
  • యూరోపియన్ యూనియన్ లో వివిధ దేశాలకి చెందిన వారు ఏ దేశంలోనైనా స్వేచ్చగా ఉద్యోగం చేసుకోవచ్చు. స్థిరపడవచ్చు. స్థానిక ప్రజలతో సమానంగా అన్ని హక్కులు, ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు, సంక్షేమ పధకాలను పొందవచ్చు. అంతే కాదు వారికి బ్రిటన్ పౌరులతో సమానంగా ఓటు హక్కు కూడా ఉంటుంది. కనుక వారు తమకు అన్ని విధాల మద్దతునిస్తున్న నిగెల్ ఫరాగే నేతృత్వంలోని యు.కె. ఇండిపెండెన్స్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఈ హక్కులపై బ్రిటన్ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విదించింది కానీ వాటిని తొలగించాలని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ భావిస్తున్నారు. ఇదీ బ్రిటన్ ప్రజల ఆగ్రహానికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
  • యూరోపియన్ యూనియన్ సభ్యదేశాల మద్య న్యాయపరమైన ఒప్పందాలు మరొక కారణంగా చెప్పుకోవచ్చు. ఈ యూనియన్ సభ్య దేశాలలో చెందిన పౌరుడు ఎవరైనా బ్రిటన్ లో తీవ్ర నేరానికి పాల్పడితే అతనిని బ్రిటన్ చట్టాల ప్రకారం శిక్షించడానికి వీలు కావడం లేదు. కారణం యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ బ్రిటన్ పై కర్ర పెత్తనం చేయడమే.

ఇటువంటి అనేక కారణాల చేత యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవాలని నిర్ణయించుకొంది. అయితే దాని వలన బ్రిటన్ కి మేలు కలుగుతుందో లేదో తెలియాలంటే మరి కొన్నాళ్ళు వేచి చూడవలసి ఉంటుంది. కానీ బ్రిటన్ నిష్క్రమణతో యూరోపియన్ యూనియన్ లో మిగిలిన సభ్య దేశాలకి చాలా బారీ నష్టం కలగడం మాత్రం తధ్యం. యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయిన తరువాత దానితో చేసుకొన్నా ఒప్పందాలన్నీ సహజంగానే రద్దవుతాయి. దాని నిబంధనలను ఏవీ బ్రిటన్ పాటించనవసరం లేదు. కనుక పైన పేర్కొన్న సమస్యలన్నిటికీ బ్రిటన్ అడ్డుకట్ట వేయడం మొదలుపెడితే ఇంతవరకు దాని మీద ఆధారపడున్న యూరోపియన్ యూనియన్ లోని చిన్న చిన్న దేశాలు చాలా తీవ్రంగా నష్టపోవచ్చు. ఊహించని అనేక కొత్త సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. బ్రిటన్ నిర్ణయం ఈ శతాబ్దంలోకే చాలా సంచలన నిర్ణయంగా చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close