ఇప్పటికీ ఎన్నికల వాయిదాను తప్పు పడుతున్న వైసీపీ..!

కిందపడినా పైచేయి మాదేనని చెప్పుకునేందుకు వైసీపీ నేతలు తమ ప్రయత్నాలను ఆపడం లేదు. కేంద్రానికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ లేఖ రాసిన తర్వాత వేగంగా పరిణామాలు మారుతున్నప్పటికీ.. ఆ టాపిక్‌ను మరింత క్లిష్టం చేయడానికే వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. మూడు రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చి.. ఎస్‌ఈసీకి మరోసారి రాజకీయ ఉద్దేశాలు అంటగట్టే ప్రయత్నం చేశారు. ఎస్‌ఈసీ.. కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ రాజకీయ పార్టీ రాసినట్లుగా ఉందని ఆరోపించారు. కడప జిల్లాలో టీడీపీకి ఒక్క స్థానం కూడా లేదని.. అలాంటి చోట.. వైసీపీ బలం ఏమిటో తెలియదా అని.. బుగ్గన ప్రశ్నించేశారు. ఏ రాజకీయ పార్టీకి ఎంత బలం ఉందో..అంచనా వేసుకోవడం..ఎస్‌ఈసీ పని కాదని బుగ్గన గుర్తించలేకపోయారు.

అక్కడ ఏకగ్రీవాలు అసాధారణం అయ్యాయని.. గతంతో పోల్చి ఎస్‌ఈసీ లేఖ రాశారు. దీన్ని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. మరో విధంగా విశ్లేషించారు. అంతే కాదు.. తన నియోజకవర్గం డోన్‌లో.. టీడీపీ ఎన్నికల బరి నుంచి వైదొలిగింది. దీన్ని ప్రస్తావిస్తూ… చంద్రబాబు ఆరోపణలు చేయడాన్ని బుగ్గన తప్పు పట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు ఎలా జరుగుతాయో.. చంద్రబాబుకు తెలియదా..అని బుగ్గన ప్రశ్నించారు. బహుశా.. బుగ్గన ఉద్దేశంలో పోలీసుల్ని ఉపయోగించి.. బెదిరించి.. ఏకగ్రీవాలు చేసుకోవడం సహజమని.. బుగ్గన అంటున్నట్లుగా ఉన్నారు.

కరోనా వల్ల లాక్ డౌన్ అయ్యే పరిస్థితులు ఏర్పడినా.. ఏపీలో నిర్బంధాలు అమలు చేస్తున్నా… ఎన్నికల వాయిదాను.. ఇప్పటికీ.. బుగ్గన తప్పు పడుతున్నారు. ఎవరిని సంప్రదించి నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. అప్పటికీ జాతీయ విపత్తుగా ప్రకటించిన తర్వాత కేంద్ర అధికారులను.. సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని ఎస్‌ఈసీ చెబుతున్నారు. అయినప్పటికీ.. ఎస్‌ఈసీపై .. తన సామాజికవర్గ పరమైన దాడితో.. ఎన్నికల వాయిదాను తప్పుపట్టాలనే తమ విధానాన్ని వైసీపీ కంటిన్యూ చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close