`బుల్ రేస్ హామీ’తో మంత్రికి కష్టాలు !

ఎడ్ల పందాలు, జల్లికట్టు, కంబాలా వంటి ఎద్దులతో సాగించే క్రీడల విషయంలో కేంద్ర పర్యావరణ, అటవి, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆ మధ్య ఇచ్చిన హామీని ఆయనే నిలబెట్టుకోలేని విచిత్ర పరిస్థితి ఏర్పడింది. దేశంలోని పలుచోట్ల బుల్ రేస్ నిర్వహణకు సమయం దగ్గర పడటంతో ఇప్పుడీ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

లూథియానాకు దగ్గర్లో నిర్వహించే `కిలా రాయిపూర్ గేమ్స్’లో భాగంగానే ఎడ్ల బండ్ల పోటీలు జరుగుతుంటాయి. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో జల్లికట్టు (పొగరబోతు ఎద్దులను లొగదీసుకునే ఆట) కంబాలా (కాడెద్దుల పోటీ) ఇంకా బండ లాగుడు పోటీల వంటివి కనీసం ఎడాదికొకసారి నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. వచ్చే నెల (ఫిబ్రవరి) 4 నుంచి 7 వరకు కిలా రాయిపూర్ గేమ్స్ లో భాగంగా ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించడం లూథియానాలో ఒక ఆచారమైపోయింది. ఎద్దులతో సాగించే ఆటల పేర్లు వేరువేరుగా ఉన్నప్పటికీ దేశమంతటా ఇలాంటి క్రూర క్రీడలు చట్టవిరుద్ధంగా సాగిస్తూనే ఉన్నారు. ఈ రకరకాల పోటీల్లో మూగజీవాలను హింసిస్తూ తాము ఆనందం పొందే లక్ష్యంతోనే సాగుతుంటాయని అందువల్ల ఇలాంటి ఎద్దుల పోటీలను లేదా క్రీడలను నిర్వహించకూడదని చాలా కాలంగా జంతు సంక్షేమ సంస్థ (యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా – AWBI) చెబుతోంది. అంతేకాదు, ఎడ్ల పందాలమీద గతంలో సుప్రీంకోర్టు 2014లో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయితే, ఇవేవీ మంత్రిగారికి ఈ తెలిసినట్లు లేవు. బుల్ రేస్ వంటి ఎద్దుల పోటీలను హాయిగా జరుపుకోవచ్చంటూ గట్టి హామీ ఇచ్చేశారు.

మంత్రివర్యులిచ్చిన హామీతో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ కంగుతింది. అటు చూస్తే మంత్రిగారిచ్చిన హామీ, ఇటు చూస్తే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అందుకే ఈ వ్యవహారం ముదరకముందే సున్నితంగా పరిష్కరించాలని అనుకుంది. మంత్రిగారికి వాస్తవ పరిస్థితిని తెలియజేస్తూ, హామీని అమలుచేస్తే ఎంతటి ఇబ్బంది కలుగుతుందో సవివరంగా చెప్పింది.

కేంద్ర మంత్రి జవదేకర్ ఇలా హామీ ఇవ్వగానే అలా విమర్శలు పుట్టుకొచ్చాయి. పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) వెంటనే స్పందిస్తూ, మంత్రిగారిచ్చిన హామీ గతంలో సుప్రీకోర్టు ఇచ్చిన తీర్పుకు పూర్తి వ్యతిరేకమని, మంత్రి తన తప్పుతెలుసుకుని హామీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఈ గండం గట్టెక్కించేందుకు యానిమల్ బోర్డ్ కి చెందిన లీగల్ సబ్ కమిటీ మేల్కొని మంత్రివర్యులకు సలహా పత్రం తయారుచేసింది. జల్లీకట్టు, కంబాలా, ఎడ్లబండ్ల పోటీ వంటివాటిని నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందనీ, అలాంటివి నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుందనీ, అక్రమంగా నిర్వహించడం, వాటిని ప్రోత్సహించడం నేరమే అవుతుందన్న వాస్తవ విషయాలను మంత్రివర్యులకు సదరు బోర్డ్ చెప్పాల్సివచ్చింది. `అయ్యా, ఈ కారణాల వల్ల తమరు ఇచ్చిన హామీని ఉపసంహరించుకోవాలి. అలాంటి ఎడ్ల పోటీలను ఏ రకంగానూ నిర్వహించడం, లేదా ప్రోత్సహించడం కూడా నేరమే అవుతుంది సుమీ.. ‘ అంటూ బోర్డ్ మంత్రివర్యులకు ఎరుకపరచింది.

మూగజీవాలను హింసిస్తూ ఆనందించే ప్రవృత్తితో కూడిన ఆటలను ప్రోత్సాహించాలనుకోవడం నిజానికి సిగ్గుచేటు. అలాంటప్పుడు కేంద్ర మంత్రి ఎలా హామీలు గుప్పించారో తెలియడంలేదని జంతుప్రేమికుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే బుల్ ఫైటింగ్ వంటి క్రూరత్వ క్రీడలను బ్యాన్ చేశాయి. కొలంబియా, ఈక్వడర్, ప్రాన్స్, పోర్చుగల్, వెనెజులా దేశాలు తాము బుల్ ఫైటింగ్ కు వ్యతిరేకమని తేల్చిచెప్పాయి.

మూగజీవాలతో సాగించే క్రీడల విషయంలో న్యాయస్థానం ఇదివరలో ఇచ్చిన ఆదేశాల మేరకు జంతువుల పరిరక్షణకు సంబంధించిన మంత్రిత్వ శాఖ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను తిరగరాయాలంటే, యానిమల్ బోర్డ్ ను విధిగా సంప్రదించాల్సిందే. అవేవీ జరగకుండా మంత్రిగారుకానీ, లేదా మంత్రిత్వశాఖ గానీ ఎడ్ల పందాలు నిర్వహించుకోవచ్చంటూ అధికారికంగా నోటీసులు జారీ చేయకూడదు. ఈ విషయాలేవీ తెలియకుండానే కేంద్ర మంత్రి జవదేకర్ ఎడ్ల పోటీలకు సంబంధించి హామీ ఇవ్వడంతోపాటుగా ఉత్తర్వు తయారుచేయమంటూ అధికారులను ఆదేశించడం ఆశ్చర్యమే.

-కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close