మెగా సినిమా కోసం మ‌రో స్టార్ రైట‌ర్‌

కొర‌టాల శివ స్వ‌త‌హాగా మంచి ర‌చ‌యిత‌. త‌న పెన్ను బ‌ల‌మే.. త‌న‌ని స్టార్ డైర‌క్ట‌ర్‌ని చేసింది. ఆయ‌న సినిమాల‌కు క‌థ‌లు, మాట‌లు, స్క్రీన్ ప్లే అన్నీ త‌న‌వే. అయితే తొలిసారి కొర‌టాల మ‌రో ర‌చ‌యిత స‌హాయం తీసుకోబోతున్నాడు.

అవును.. కొర‌టాల శివ – చిరంజీవి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. క‌థ కూడా సిద్ధ‌మైంది. అయితే సంభాష‌ణ‌ల విష‌యంలో కొర‌టాల శివ మ‌రో ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్ స‌హాయం తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది. డైలాగుల‌లో కొంత పార్ట్ బుర్రా రాయ‌బోతున్నాడ‌ట‌. చిరంజీవి ఖైది నెం.150, సైరా చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేశాడు బుర్రా. ఆయా చిత్రాల‌తో బుర్రా సాయిమాధ‌వ్‌కి మెగా కాంపౌండ్‌తో, మ‌రీ ముఖ్యంగా చిరంజీవితో సాన్నిహిత్యం ఏర్ప‌డింది. అందుకే 152వ సినిమాలోనూ కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల‌కు బుర్రాతో సంభాష‌ణ‌లు రాయించుకోవాల‌ని చిరు భావించాడు. దానికి కొర‌టాల కూడా ఒప్పుకోవ‌డంతో… చిరు 152లో బుర్రా సాయిమాధ‌వ్ `పెన్ను` చేసుకోబోతున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గైడ్‌లైన్స్’ రూపొందించుకున్న టాలీవుడ్

చిత్ర‌సీమ యావ‌త్తూ 'క్లాప్' కొట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది. మ‌ళ్లీ సెట్లు క‌ళ‌క‌ళ‌లాడే రోజు కోసం క‌ల‌లు కంటోంది. జూన్‌లో చిత్రీక‌ర‌ణ‌లు మొద‌ల‌వుతాయి. అయితే.. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే గైడ్ లైన్స్‌కి...

త్రివిక్ర‌మ్‌కి రీమేకులు వ‌ర్క‌వుట్ అవుతాయా?

స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌లైన ద‌ర్శ‌కులు రీమేక్‌ల‌ను అంత‌గా ప్రోత్స‌హించ‌రు. కార‌ణం.. వాళ్ల ద‌గ్గ‌రే బోలెడ‌న్ని క‌థ‌లుంటాయి. త్రివిక్ర‌మ్ ఇప్ప‌టి వ‌ర‌కూ రీమేక్ జోలికి వెళ్ల‌లేదు. హాలీవుడ్ క‌థ‌ల్ని, న‌వ‌ల‌ల్ని, పాత సినిమాల్నీ స్ఫూర్తిగా తీసుకుని...

కరోనా టెస్టుల లెక్కలు తేల్చాల్సిందేనన్న తెలంగాణ హైకోర్టు ..!

కరోనా వైరస్ టెస్టులు పెద్దగా చేయకపోవడం.. తెలంగాణ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెడుతోంది. టెస్టుల విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కొద్ది రోజుల కిందట..కరోనా...

రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువ.. ఈ సారి డిప్యూటీ సీఎం..!

నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థులు ఎక్కువైపోతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై రోజా ఫైరయ్యారు. నారాయణస్వామి పుత్తూరులో పర్యటించారు. కానీ రోజాకు సమాచారం అందలేదు. పుత్తూరు .. ఆమె ఎమ్మెల్యేగా...

HOT NEWS

[X] Close
[X] Close