కాంగ్రెస్ పార్టీలో చేరిన బైరెడ్డి..!

Byreddy Rajasekhar Reddy join in congress
Byreddy Rajasekhar Reddy join in congressByreddy Rajasekhar Reddy join in congress

కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాహుల్ గాంధీ సంక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రత్యేకహోదా ఇవ్వగలిగే పార్టీ… కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని.. అందుకే ఆ పార్టీలో చేరానని.. బైరెడ్డి ప్రకటించారు. కర్నూల్‌లో త్వరలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన బైరెడ్డి ప్రకటించారు. ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించామన్నారు. బైరెడ్డి కాంగ్రెస్‌లో చేరికలో కోట్ల కీలక పాత్ర పోషించారు. బైరెడ్డి టీడీపీలో చేరడం ఖాయమని కొద్ది రోజుల కిందట ప్రచారం జరిగింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో… ఇండిపెండెంట్‌ను అభ్యర్థిని నిలబెట్టారు బైరెడ్డి. అప్పుడు ముఖ్యమంత్రి ..సచివాలయానికి పిలిపించి మట్లాడారు. అభ్యర్థిని ఉపసంహరించుకునేందుకు బైరెడ్డి అంగీకరించారు. దాంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైంది. అప్పుడే మంచి రోజు చూసుకుని టీడీపీలో చేరుతానని… బైరెడ్డి ప్రకటించినా… తర్వాత తెలుగుదేశం వైపు నుంచి సానుకూలత రాలేదు.

అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయలకు దూరంగా, మౌనంగా ఉంటున్నారు. టీడీపీలోని ఓ వర్గం బైరెడ్డిని చేర్చుకోకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థి అయిన మాండ్ర శివానందరెడ్డితో కలిసి జిల్లాకు చెందిన ఒకరిద్దరు నాయకులు బైరెడ్డిని టీడీపీలోకి రాకుండా అడ్డుకట్ట వేశారు. పాణ్యం నుంచి బైరెడ్డిని బరిలోకి దింపితే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని, నందికొ ట్కూరులో కూడా ప్రభావం చూపగలరని నంద్యాల పార్లమెంట్‌ ఇన్‌చార్జి బాధ్యతలు చూస్తున్న టీడీపీ నాయకుడు పార్టీ అధినేతకు నివేదిక ఇచ్చారు. అయినా కర్నూలులో టీడీపీ చేరికకు అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఆయన అన్న కుమారుడు కొద్ది రోజుల కిందట వైసీపీలో చేరిపోయారు. కిరణ్‌కుమార్ రెడ్డి తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్న ఓ ముఖ్య నేత బైరెడ్డినే.

ఊమెన్ చాందీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్చ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీలో చేరికలపై దృష్టి పెట్టారు. ఇతర పార్టీల్లో ఉన్న వారికంటే.. ఖాళీగా ఉన్న నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బైరెడ్డికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అధికారంలోకి వస్తే రాజ్యసభ సభ్యత్వం … సమయాన్ని చూసి పీసీసీ చీఫ్ గా నియమిస్తామని.. కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com