మంత్రి వ‌ర్గ కూర్పులో కేటీఆర్ మార్కు ..!

తెలంగాణ మంత్రివ‌ర్గ ఏర్పాటుపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నెలాఖ‌రు వ‌ర‌కూ విస్త‌ర‌ణ ఉండ‌ద‌నే సంకేతాలు ఇచ్చేశారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. అయితే, ఎన్నిక‌ల స‌మ‌యంలో సిటింగులంద‌రికీ సీట్లు ఇచ్చినట్టుగా… గ‌తంలో మంత్రులుగా ఉన్న‌వారంద‌రికీ మ‌ళ్లీ ప‌ద‌వులు ఇచ్చే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నాయి. కుల స‌మీక‌ర‌ణాలతోపాటు, వీర విధేయుల‌కు ప‌ద‌వులు అనే ప్ర‌చారంలో కూడా ఏమంత వాస్త‌వం లేన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఎందుకంటే, ఇప్పుడు తెరాస‌లో రాజ‌కీయ‌మంతా కేటీఆర్ కేంద్రీకృతంగా నెమ్మ‌దిగా మారుతున్న ప‌రిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే మంత్రి వ‌ర్గ కూర్పు ఉండే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి.

గ‌డ‌చిన నాలుగు రోజులుగా తెలంగాణ భ‌వ‌న్ కి మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్న‌వారి తాకిడే ఎక్కువ‌గా ఉంది. అయితే, వీరంతా కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తూ ఉండ‌టం విశేషం! పార్టీ బాధ్య‌త‌లు కేటీఆర్ కి క‌ట్ట‌బెట్టిన ద‌గ్గ‌ర్నుంచీ ఆయ‌న చుట్టూనే అంద‌రూ చక్క‌ర్లు కొడుతున్నారు. గ‌తంలో మంత్రి ప‌ద‌వులు నిర్వ‌ర్తించిన‌వారితో స‌హా చాలామంది ఎమ్మెల్యేలు ప్ర‌తీరోజూ కేటీఆర్ ని క‌లుసుకుని మాట్లాడుతూ ఉన్నారు. అంటే… మంత్రి వ‌ర్గ కూర్పులో కేటీఆర్ మార్కు కచ్చితంగా ఉండే ప‌రిస్థితే బ‌య‌ట క‌నిపిస్తోంది. దీనికి అనుగుణంగా, ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఈసారి కేబినెట్ లో వీలైనంత మంది సీనియ‌ర్ల‌కు క‌త్తెర వేసే అవ‌కాశాలున్నాయ‌నీ, అదే క‌స‌ర‌త్తు జ‌రుగుతోంద‌న్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. మంత్రివ‌ర్గంలో యువ‌త‌కు ప్రాధాన్య‌త ఉండొచ్చ‌ని తెలుస్తోంది. కేటీఆర్ కి అనుకూలంగా ఉండే కేబినెట్ ను ఏర్పాటు చేయాల‌నేదే ముఖ్య‌మంత్రి ఆలోచ‌న అనే అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే… కేసీఆర్ తో పాటు మ‌హ‌మూద్ అలీ మాత్ర‌మే ప్ర‌మాణ స్వీకారం చేశారు. మిగ‌తా ఎవ్వ‌రికీ అవ‌కాశం ఇవ్వ‌లేదు. చివ‌రికి, రికార్డు స్థాయి మెజారిటీ సాధించిన మేన‌ల్లుడు హ‌రీష్ రావుని కూడా ముందుగా మంత్రిగా తీసుకోలేదు. అంద‌రితో స‌మానంగానే, అంద‌రితోపాటుగానే ఆయ‌న అనే సంకేతాలు ఇచ్చేలా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించారు. ఎక్కిడిక‌క్క‌డ ఇవ్వాల్సిన సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. తెరాస‌లో రెండో ప‌వ‌ర్ సెంట‌ర్ కేటీఆర్ అనేది సుస్ప‌ష్టం. కాబ‌ట్టి, మంత్రి వ‌ర్గ కూర్పులో ఆయ‌న ప్ర‌మేయం, ఆయ‌న‌కి అనుగుణంగా కేసీఆర్ ఆలోచ‌న ఉండ‌టం అనేది కూడా ఉంటుంద‌నేది ఇంకా స్ప‌ష్టం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close