‘ఆదిపురుష్’ వివాదాల్ని త‌ట్టుకోగ‌ల‌దా?

పౌరాణిక గాథ‌లు తీయ‌డం అంత ఈజీ కాదు. మేకింగ్ సంగ‌తి అటుంచండి. అందులో పాత్ర‌ల్ని తీర్చిదిద్దే విధానంలో ఏ మాత్రం తేడా వ‌చ్చినా, చాలామంది మ‌నో భావాలు దెబ్బ‌తింటాయి. ఎప్పుడు ఏ పాయింట్ ని ప‌ట్టుకుని `మా మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయోచ్‌..` అంటూ మీడియా ముందుకు రావ‌డానికి సిద్ధ‌ప‌డే వ‌ర్గానికి… ఇంత‌కు మించిన త‌రుణం మ‌రోటి దొర‌క‌దేమో..? బ‌యోపిక్‌లలో దాదాపు 90 శాతం వివాదాలకు సిద్ధ‌ప‌డే త‌యార‌వుతుంటాయి. తాజాగా.. `ఆదిపురుష్‌` పై కూడా వివాదాలు మొద‌ల‌య్యాయి.

`ఆదిపురుష్` రామాయ‌ణ గాథ అన్న‌ది అంద‌రికీ తెలిసిందే. రామాయ‌ణంలో వివాదాస్ప‌ద అంశాలు పెద్ద‌గా ఉండ‌వు. కాక‌పోతే.. రావ‌ణుడి పాత్ర ద‌గ్గ‌రే అస‌లు పేచీ వ‌స్తుంది. రావ‌ణుడి పాత్ర‌ని ఏమాత్రం పాజిటీవ్ గా చూపించినా, వివాదాలు చుట్టు ముడ‌తాయి. `ఆదిపురుష్‌`లో రావ‌ణుడి పాత్ర ని పాజిటీవ్ గా చూపించ‌బోతున్నార‌ని, రామ‌,రావ‌ణ యుద్ధం స‌రైనదే అనే రీతిలో స‌న్నివేశాలుంటాయ‌ని సైఫ్ అలీ ఖాన్ ఈమ‌ధ్య నోరు జారాడు. దాంతో ఓ వ‌ర్గం భ‌గ్గుమంది. రావ‌ణుడు రాక్ష‌సుడ‌ని, ఆ పాత్ర‌ని పాలీష్ చేసి చూపించ‌డం, రాముడి పాత్ర‌ని త‌గ్గించి చూపించ‌డ‌మే అని… విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. దాంతో.. సైఫ్ అలీఖాన్ దిగి వ‌చ్చాడు. త‌న మాట‌లు ఎవ‌రి మ‌న‌సైనా నొప్పించి ఉంటే క్ష‌మించ‌మ‌ని కోరాడు. అంతే కాదు.. రామాయ‌ణ గాథ‌ని తాము ఏమాత్రం వ‌క్రీక‌రించ‌డం లేద‌ని, ఏ పాత్ర‌నీ కించ‌ప‌ర‌చ‌కుండా సినిమాని తీస్తున్నామ‌ని చెప్పుకొచ్చాడు. సైఫ్ స‌వ‌ర‌ణ‌ల‌తో ఎవ‌రు ఎంత వ‌ర‌కూ సంతృప్తి ప‌డ‌తారో తెలీదు గానీ, `ఆదిపురుష్` ఇంకా మొద‌లు కాలేదు. ఇంత‌లోనే.. వివాదాలు మొద‌లైపోయాయన్న‌ది వాస్త‌వం. మున్ముందు మ‌రిన్ని విమ‌ర్శుల‌,నింద‌లు, ఆరోప‌ణ‌లు `ఆదిపురుష్` మోయాల్సి ఉంటుంది. అయినా సినిమా మొద‌ల‌వ్వ‌క‌ముందే… ఆ సినిమా గురించిన లీకులు ఇవ్వ‌డం ఎందుకు? ఇప్పుడు సారీలు చెప్ప‌డ‌మెందుకు? సైఫ్ అలీఖానే కాదు, ఆదిపురుష్ టీమ్ మొత్తం ఈ విష‌యంలో కాస్త అప్ర‌మ‌త్తంగా ఉండ‌డం మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close