అమిత్ షా పర్యటన “కేసీఆర్ టూర్‌”కు విరుగుడుగా మారగలదా !?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. నిర్మల్‌లో బహిరంగసభలో ప్రసంగించబోతున్నారు. సెప్టెంబర్ పదిహేడో తేదీ అంటే తెలంగాణ విమోచనా దినం. నిజాం నుంచి సైనిక చర్య ద్వారా దేశంలోకి తెలంగాణను విలీనం చేసిన రోజు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ పని పూర్తి చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ అధికారికంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ముస్లింలకు ఇష్టం ఉండదనో.. మరో కారణమో కానీ ఆ పని చేయలేదు. అధికారంలోకి రాక ముందు ఉద్యమంలో.. తెలంగాణ విమోచనను అధికారికంగా చేయాలన్న డిమాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేసిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేసింది. దీంతో బీజేపీ ఆ నినాదాన్ని అందుకుని… ఆందోళనలు చేస్తోంది. ఈ సారి అమిత్ షాను తెలంగాణకు తీసుకు వచ్చి టీఆర్ఎస్‌కు కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించిది.

తెలంగాణ రాష్ట్ర సమితికి బీజేపీ ప్రత్యర్థా.. మిత్రపక్షమా అన్న గందరగోళం సృష్టించడంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడూ పైచేయి సాధిస్తూనే ఉన్నారు. బీజేపీ పట్టు పెంచుకుంటోందన్న అభిప్రాయం కలిగిన ప్రతీ సారి ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రుల్ని… బీజేపీ పెద్దల్ని కలుస్తారు. తెలంగాణలో బీజేపీ – టీఆర్ఎస్ భాయి..భాయి అనే ప్రచారం ఊపందుకుంటుంది. ఇక తెలంగాణ పర్యటనకు వచ్చే కేంద్రమంత్రులతో ప్రశంసలు పొందుతూంటారు. దీంతో ఆ ప్రచారానికి మరింత ఊపు వస్తుంది.ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించి బీజేపీతో టీఆర్ఎస్‌కు స్నేహమే లేదు అంతా లడాయేనని చెప్పుకోవడం తెలంగాణ బీజేపీ నేతలకు పెద్ద టాస్క్ అయిపోయింది.

నిర్మల్ సభ ద్వారా కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ విమోచనకు బీజం పడిందని అమిత్ షా గర్జించే అవకాశం ఉంది. అయితే అది ఎంత వరకూ ప్రజల్లో సీరియస్‌గా వెళ్తుందన్న దానిపైనే స్పష్టత లేకుండా పోయింది. కేసీఆర్ అలాంటి వాతావరణం సృష్టించారు. దీనికి కౌంటర్ ఇవ్వడానికి అమిత్ షా పర్యటనను గరిష్టంగా వాడుకోవాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే కేసీఆర్ అవినీతిపై ఆధారాలిస్తామని.. విచారణ జరిపించాలని లేకపోతే వారిద్దరి బంధం నిజమేనని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అమిత్ షాను కలుస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ అపాయింట్‌మెంట్ దొరకడం కష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close