కనీసం ఈ విషయంలో ఐక్యంగా అడగలేరా?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సవాలక్ష విషయాల్లో విభేదాలు, అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. అనేకానేక పంపకాలు, సమస్యల విషయంలో రెండు రాష్ట్రాల నడుమ పీటముడి బిగుసుకుపోయి ఉండవచ్చు. రెండు రాష్ట్రాలు కలిసి ఐక్యంగా పురోగతి సాధించాలనే ఆదర్శనీయమైన ఒక ఆలోచనకు ఇలాంటివి ఈ దశలో విఘాతం కలిగిస్తూ ఉండవచ్చు. అయితే రెండు రాష్ట్రాలూ కూడా ఉమ్మడిగా ఒకే డిమాండు చేస్తూ ఉన్నప్పుడు.. ఈ డిమాండు నెరవేర్చుకోవడంలో ఒకరికి సఫలం కావడం వలన మరొకరికి నష్టం లేనప్పుడు, ఇద్దరూ తమ ఉమ్మడి కోరిక కోసం కేంద్రం మీద కలిసి ఒత్తిడి తేవచ్చు కదా! రెండు రాష్ట్రాల తరఫున విడివిడిగా అడిగే బదులు కనీసం ఒక్క డిమాండ్‌ విషయంలోనైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ, వీలైతే ఆయా రాష్ట్రాల్లోని అన్ని పార్టీలూ కలిసి ఉమ్మడిగా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి తక్షణం తమ కోరిక సాకారం అయ్యేలా చేసుకోవచ్చు కదా అనే అభిప్రాయాలు ఇప్పుడు విశ్లేషకుల్లో వ్యక్తం అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్ల పెంపు అనేది.. విభజన పుణ్యమాని రెండు తెలుగు రాష్ట్రాలకు కలిసి వచ్చిన ఒక అంశంగా చెప్పుకోవాలి. విభజన చట్టం నిర్దేశించే ప్రకారం తెలంగాణ లో ఉన్న అసెంబ్లీ సీట్ల సంఖ్య 119నుంచి 153కు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కు ఈ సీట్లు పెరగవలసిన అవసరం ఉంది. సాధారణంగా అయితే 2026 వరకు మన దేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అనేది సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం ఉవాచ.

ఇటీవల వైకాపా లోక్‌సభ ఫ్లోర్‌లీడర్‌ మేకపాటి రాజమోహనరెడ్డి కేంద్ర ఈసీని కలిసి ఈమేరకు విన్నవించినప్పుడు ఆయన అదే సెలవిచ్చారు. 2026 దాకా ఆగాల్సిందే అన్నారు. అయితే ఈ నిబంధన ఉన్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలకు విభజన అనే ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ సీట్లు పెరగవలసిన అవసరం ఉన్నదంటూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా చెబుతున్నారు. ఏపీ సర్కారుకు కూడా దీని మీద చాలా ఆశలున్నాయి. తమ పార్టీ నాయకులను బుజ్జగించుకోవడానికి.. వైకాపా వారిని ఆకట్టుకోవడానికి వారు దీనిమీదనే ఆధారపడుతున్నారు. తెలంగాణ సీఎస్‌ రాజీవ్‌ శర్మ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలంటూ కేంద్రానికి లేఖ కూడా రాశారు. విభజన చట్టంలో ఉన్న ప్రత్యేకమైన వెసులుబాటును ఆయన ప్రస్తావించారు.

అంతా బాగానే ఉంది. రెండు ప్రభుత్వాలూ, రెండు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలూ సీట్ల పెంపునే కోరుకుంటున్నాయి. విడివిడిగా కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాయి. కేంద్రం ఏదో అందులో కూడా ఈ రాష్ట్రాలకు తమ సొత్తు పెట్టేస్తున్నట్లుగా ఇందులోనూ మీనమేషాలు లెక్కిస్తున్నది. అయితే జనం కోరుకుంటున్నది ఏంటంటే.. కనీసం అందరూ ఏకాభిప్రాయంతో ఉన్న ఈ విషయంలోనైనా పార్టీలు, రెండు ప్రభుత్వాలూ కలసి కేంద్రం మీద ఒత్తిడి తెస్తే వెంటనే పని సానుకూలం అవుతుంది కదా అనుకుంటున్నారు. మరి నాయకుల్లో ఆ ఆలోచన వస్తుందో రాదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close