జూనియర్ కొత్త ఫార్ములాతో సక్సెస్ అవుతాడా?

హైదరాబాద్: ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం మరికొద్ది గంటల్లో విడుదల కాబోతోంది. క్షణక్షణానికీ ఈ చిత్రంపై హైప్ విపరీతంగా పెరిగిపోతోంది. ఆడియో మంచి విజయం సాధించటం, ముఖ్యంగా ‘ఐ వాన్నా ఫాలో ఫాలో యు’ పాట అందరి నోళ్ళలో నానుతుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. దానికితోడు టీజర్, ట్రైలర్స్‌లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎన్నాళ్ళనుంచో ఇండస్ట్రీ హిట్ లేక తహతహలాడుతున్న జూనియర్ ఎన్‌టీఆర్ ఆరాటం ఈ 25వ చిత్రంతోనైనా తీరుతుందా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. చిత్రాల ఎంపికలో అతను పాత ఫార్ములాను వదిలి ఈ చిత్రంతో ఒక కొత్త ఫార్ములాను అనుసరిస్తున్నందున దీనితో సక్సెస్ అవుతాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

జూనియర్ ఎన్‌టీఆర్ గత చిత్రాలను గమనిస్తే ఒక ప్యాటర్న్‌ను గమనించొచ్చు. బాగా క్రేజ్‌లో ఉన్న దర్శకుడిని గానీ, సక్సెస్‌ఫుల్ జోనర్ గానీ తీసుకుని ప్రాజెక్టులు చేసుకుంటూ వెళుతున్నాడు. శక్తి దగ్గరనుంచి ఈ ధోరణిని గమనించొచ్చు. మగధీర తర్వాత వచ్చిన ఈ చిత్రం పూర్తిగా మగధీర తరహాలోనే సోషియో ఫాంటసీగా సాగుతుంది. బిల్లా చిత్రంతో అప్పుడే సక్సెస్ కొట్టిన మెహర్ రమేష్ శక్తి చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం ఎంత ఫ్లాప్ అయిందంటే అప్పటివరకు అగ్రనిర్మాతగా ఉన్న అశ్వనీదత్, శక్తి తర్వాత ఇల్లు కూడా అమ్ముకునే స్థాయికి చేరుకున్నాడని చెబుతారు. శక్తి తర్వాత వచ్చిన ఊసరవెల్లి చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. సురేందర్ రెడ్డి తనకు గతంలో అశోక్ అనే ఫ్లాప్ ఇచ్చినా కూడా కిక్‌తో కొట్టి ఉండటంతో అతనిని మళ్ళీ తీసుకున్నాడు. 2012లో వచ్చిన దమ్ముకు బోయపాటి శ్రీనివాస్ దర్శకుడిగా తీసుకున్నారు. అతను అంతకుముందే సింహా అనే సూపర్ హిట్ కొట్టి ఉన్నాడు. 2013లో వచ్చిన బాద్షా చిత్రానికి దర్శకుడు శ్రీను వైట్ల. ఆ టైమ్‌లో శ్రీను వైట్ల దూకుడుగా ఉన్న సంగతి తెలిసిందే. అదే సంవత్సరం వచ్చిన రామయ్యా వస్తావయ్యా చిత్రానికి గబ్బర్‌సింగ్‌తో హిట్ కొట్టిన హరీష్ శంకర్ దర్శకుడు. తర్వాత వచ్చిన రభసకు కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. గత ఏడాది వచ్చిన టెంపర్‌కు దర్శకుడు పూరి జగన్నాథ్. ఆయన హార్ట్ ఎటాక్‌తో అప్పుడే హిట్ కొట్టి ఉన్నారు.

నాన్నకు ప్రేమతో దర్శకుడు సుకుమార్. ఈయన ఇంతకుముందు 1 – నేనొక్కడినే అనే పెద్ద ఫ్లాప్ ఇచ్చారు. అయినా కూడా ఎన్‌టీఆర్ సుకుమార్‌కు అవకాశం ఇచ్చి తన పాత ఫార్ములాను మార్చారు. ఈ మార్పు ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి. దీనికి తోడు లౌడ్ యాక్టింగ్‌ అన్నివర్గాలకూ పట్టదని తెలుసుకున్నాడో, ఏమో గానీ ఎన్‌టీఆర్ ఈ చిత్రంతో తన శైలి మార్చుకున్నట్లు కనబడుతోంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కు తగ్గట్టుగా సటిల్‌గా అభినయించటం, అండర్ ప్లే చేయటం, సున్నితమైన ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వటం చేస్తే ఎన్‌టీఆర్‌కు తప్పనిసరిగా మరిన్ని వర్గాలకు చేరువవటానికి, తద్వారా మార్కెట్ మరింత పెరగటానికి అవకాశముంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close