కోడ్ ఉన్నా మోడీ కేబినెట్ భేటీలు ఎలా నిర్వహిస్తున్నారు..?: చంద్రబాబు

ఎన్నికల కోడ్ పేరుతో ప్రభుత్వాన్ని పని చేయకుండా చేస్తున్నారని.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమలు చేయాలంటే.. అందరికీ ఒకే రకంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమీక్షలు చేయాడనికే కోడ్ అడ్డంకి వస్తే.. కేంద్ర కేబినెట్ భేటీని..ప్రధానమంత్రి రెండు సార్లు ఎలా నిర్వహించారని.. ఎలా అధికారిక నిర్ణయాలు తీసుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత…ఓ సారి .. తొలి దశ పోలింగ్‌ అయిన తర్వాత మరోసారి కేంద్ర కేబినెట్ భేటీ అయింది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే.. ఏపీలో మాత్రం… పోలింగ్ ప్రక్రియ పూర్తయినా.. చంద్రబాబు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని.. వైసీపీ ఫిర్యాదు చేయడం.. అది కోడ్ ఉల్లంఘన అంటూ ..ఈసీ ఆంక్షలు విధించడం జరిగిపోయాయి. చంద్రబాబు ఇదే విషయాన్ని ఎత్తి చూపుతున్నారు. ఈసీ విధానాలపై నా పోరాటం కొనసాగుతుందని తిరుపతిలో ప్రకటించారు. అధికారులతో సమీక్షలపై ఈసీ ఆంక్షలు విధించడం హేయమన్నారు.

ఒడిశా సీఎం హెలికాప్టర్‌ను తనిఖీ చేశారని.. ప్రధాని హెలికాప్టర్‌ను తనిఖీ చేశారని ఓ అధికారిని సస్పెండ్‌ చేశారని మండిపడ్డారు. ఆంక్షలు అందరిపై ఒకే విధంగా ఉండాలన్నారు.ప్రజాస్వామ్యవాదులంతా తిరగబడాల్సిన సమయమిదన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం ఎక్కడా రాజీపడలేదని ప్రకటించారు.ఎన్నికల కమిషన్‌, సీబీఐతో వ్యక్తిగత విభేదాలు లేవని… ప్రజాస్వామ్యం కోసమే పోరాడుతున్నానన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంలు సద్వినియోగం కాలేదన్నారు. పోలింగ్‌ రోజు శాంతిభద్రతలకు విఘాతం కలిగించి.. ఓటర్లను పోలింగ్‌కు దూరం చేసేలా కుట్రలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తేలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ మైండ్‌గేమ్‌ ఆడుతోందన్నారు. ప్రజల తీర్పు స్పష్టంగా ఉందని.. టీడీపీకి అనుకూలంగా అండర్‌ కరెంట్ ఉందన్నారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నా అక్కడ ఓటేయకుండా.. దొరికిన వాహనం ఎక్కి ఏపీకి లక్షల మంది రావడంలోనే… రాష్ట్రానికి కాపాడుకోవాలన్న చిత్తశుద్ధి ఉందని చంద్రబాబు విశ్లేషించారు. అధికారులు మోదీని చూసి కాకుండా దేశాన్ని చూసి పనిచేయాలన్నారు. మోదీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close