మోత్కుప‌ల్లి వారితో స‌ర్దుకుని పోగ‌ల‌రా..?

దాదాపు మూడున్న‌రేళ్లుగా గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి కోసం టీ టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహ‌లు ఎదురుచూశారు. రేపోమాపో ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ కావ‌డం ఖాయం అనుకున్నారు. టీడీపీ వ‌ర్గాలు కూడా ఆయ‌న్ని ముద్దుగా గ‌వ‌ర్న‌ర్ అంటూనే పిలిచేవి. కానీ, ఈ మ‌ధ్య కేంద్రం కొన్ని రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఆ జాబితాలో మోత్కుప‌ల్లి లేరు. దీంతో మొత్తం సీన్ రివ‌ర్స్ అయింది. అయితే, త్వ‌ర‌లో మ‌రో రెండు రాష్ట్రాల‌కు కొత్త‌గా గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించే అవ‌కాశం ఉందంటూ తాజాగా వినిపిస్తోంది. ఈ జాబితాలోనైనా మోత్కుప‌ల్లికి ప్రాధాన్య‌త ల‌భిస్తుందా అనే చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే.. టీ టీడీపీ వ‌ర్గాలో మ‌రో చ‌ర్చ ప్రారంభ‌మైందని స‌మాచారం. ఇన్నాళ్లూ గ‌వ‌ర్న‌ర్ గిరీ కోసం ఎదురుచూసిన మోత్కుప‌ల్లి.. ఇక‌పై క్రియాశీల రాజ‌కీయాల మీద దృష్టి పెట్టినా అంత‌గా రాణిస్తారా అనే అనుమానాలు వారి నుంచే వ్య‌క్తం అవుతూ ఉండ‌టం విశేషం.

అత్యున్న‌త ప‌ద‌విలోకి వెళ్తాన‌న్న ఉద్దేశంతో ఆయ‌న పార్టీ త‌ర‌ఫున పెద్ద‌గా మాట్లాడ‌టం మానుకున్నారు. పార్టీ చేస్తున్న పోరాటాలు, నిర‌స‌న‌లు వంటి కార్య‌క్ర‌మాల‌కు కూడా దూరంగా ఉంటూ వ‌చ్చారు. దీంతో స‌హ‌జంగానే ఆయ‌న‌పై టీడీపీ నేత‌ల్లో కొంత అసంతృప్తి ఏర్ప‌డింది. అంతేకాదు, తెలంగాణ టీడీపీలో కీల‌కంగా ఉంటున్న ఒక‌రిద్ద‌రు ప్ర‌ముఖ నేత‌ల‌తో ఆయ‌న క‌లిసి ప‌నిచేసే ప‌రిస్థితి లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. అధ్యక్షుడు చంద్ర‌బాబు నాయుడు కేవ‌లం ఆంధ్రా రాజ‌కీయాల‌కు ప‌రిమితం కావ‌డంతో, తెలంగాణ‌లోకి నాయ‌క‌త్వం తీరుపై మోత్కుప‌ల్లి మొద‌ట్నుంచీ సంతృప్తిగా లేర‌నీ, ఎలాగూ గ‌వ‌ర్న‌ర్ పోస్టు వ‌స్తుంది కాబ‌ట్టి, రాష్ట్ర రాజ‌కీయాల గురించి తానెందుకు ప‌ట్టించుకోవాల‌నే ఉద్దేశంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉంటూ వ‌చ్చార‌ని స‌మాచారం! అయితే, ఇప్పుడు మ‌రోసారి క్షేత్ర‌స్థాయికి వెళ్ల‌క త‌ప్ప‌దు. త‌న మ‌ద్ద‌తుదారుల‌ను, కేడ‌ర్ ను, అలాగే రాష్ట్రంలోని పార్టీకి చెందిన ప్ర‌ముఖ నేత‌ల‌నూ క‌లుపుకుంటూ ముందుకు సాగాల్సిన ప‌రిస్థితి.

లేదంటే, ఆయ‌న‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు క‌నిపించ‌డం లేదు. స‌మ‌స్య అంతా ఇక్క‌డే ఉంద‌నీ… పార్టీలో కొన‌సాగాలంటే కొంత‌మంది నాయ‌కుల‌తో ఆయ‌న స‌ర్దుబాటు చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఉంద‌నీ అంటున్నారు. తెలంగాణ‌కు చెందిన కొంద‌రు టీడీపీ నేత‌ల‌పై ఆ మ‌ధ్య చంద్ర‌బాబుకు కూడా మోత్కుప‌ల్లి ఫిర్యాదు చేశార‌ట‌. పార్టీ సెట‌ప్ స‌రిగా లేద‌నీ, రాష్ట్రంలో ఇలాగైతే పార్టీ ఎలా ఎదుగుతుంద‌నే చ‌ర్చ చంద్రబాబు స‌మ‌క్షంలోనే ఆయ‌న లేవ‌నెత్తార‌ట‌! దీంతో అక్క‌డున్న ఇత‌ర టీడీపీ నేత‌లు మోత్కుప‌ల్లిపై కాస్త గ‌రంగ‌రం అయ్యార‌ట‌. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో సొంత పార్టీ నేత‌ల నుంచే మోత్కుప‌ల్లి పున‌రాగ‌మ‌నానికి పూర్తిస్థాయి స‌హ‌కారం ల‌భిస్తుందా అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మొత్తానికి, మోత్కుప‌ల్లి వ్య‌వ‌హారం టీ టీడీపీలో కొత్త రాజ‌కీయాల‌కు తెర తీసే విధంగా మారుతోంద‌ని అనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...
video

ట్రైల‌ర్ టాక్‌: ఫ్యామిలీమెన్ టూ మెంట‌ల్ మెన్‌

https://www.youtube.com/watch?v=xB7b3RzicUU విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఎగ్రెసివ్‌నెస్ గుర్తొస్తుంది. అర్జున్ రెడ్డి నుంచి అది అల‌వాటైపోయింది. అయితే... త‌న‌లో కూల్ & కామ్ పెర్‌ఫార్మ‌ర్ ఉన్నాడు. దాన్ని బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ప‌ర‌శురామ్. 'ఫ్యామిలీస్టార్‌'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close