జగన్ సర్కార్‌పై అంతర్జాతీయ ట్రిబ్యునళ్లలో కేసులు..!

జగన్మోహన్ రెడ్డి సర్కార్‌పై అంతర్జాతీయ కోర్టుల్లో ఆర్థిక పరమైన కేసులు దాఖలవడం ఖాయంగా కనిపిస్తోంది. విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాల విషయంలో… తాము ఏపీ సర్కార్‌పై అంతర్జాతీయ కోర్టుల్లో పిటిషన్లు వేయబోతున్నామని.. ఐదు దేశాలు.. కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖకు సమాచారం ఇచ్చాయి. సంప్రదాయేతర ఇంధన విద్యుత్ రంగంలో… జపాన్, అబుదాబి, కెనడా, అమెరికా, సింగపూర్ దేశాల పెట్టుబడిదారులు దాదాపుగా రూ. 40వేల కోట్లు పెట్టుబడులుగా పెట్టారు. ఈ పెట్టుబడుల్లో ఆయా దేశాల్లో ప్రభుత్వ నిధులు, పెన్షన్ ఫండ్స్ కూడా ఉ్ననాయి. అయితే .. జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత… పీపీఏను రద్దు చేయాలని ప్రయత్నించారు. కోర్టు ఆ నిర్ణయాలను కొట్టి వేయడంతో… ఆరు నెలల నుంచి బిల్లులు చెల్లింపులు చేయడం.. ఆయా సంస్థల వద్ద నుంచి కరెంట్ కొనుగోలు చేయడం నిలిపివేశారు. దాంతో… ఆయా దేశాలు తమ పెట్టుబడులకు ముప్పు వచ్చినట్లుగా భావించాయి.

ఈ వివాదం కొద్ది నెలలుగా సాగుతోంది. వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేసింది. కానీ ఏపీ సర్కార్ మాత్రం వినిపించుకోవడం లేదు. దీంతో న్యాయపరమైన చర్యల వైపు మొగ్గు చూపక తప్పడం లేదని.. ఆయా సంస్థలు భారత భారత విదేశాంగ శాఖకు సమాచారం ఇచ్చాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. విదేశీ పెట్టుబడులపై.. ఏపీ సర్కార్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపిస్తోందని భావిస్తోంది. విదేశీ పెట్టుబడిదారుల రక్షణకు కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే.. అవన్నీ.. పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపడం లేదు. ఇప్పటికీ పరిస్థితిని ఏపీ సర్కార్ అంచనా వేయలేకపోతోంది. మొండి పట్టుదలతో ఉంది. ఆయా సంస్థలకు విదేశీ ట్రిబ్యునళ్లకు వెళ్లే అధికారం లేదని వాదిస్తున్నాయి.

కానీ.. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగానే పెట్టుబడులు పెట్టామని.. ట్రిబ్యునల్‌కు వెళ్లే అవకాశం తమకు ఉందని కంపెనీలు కేంద్రానికి స్పష్టం చేశాయి. విద్యుత్ మంత్రి ఈ అంశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఏపీ ప్రభుత్వం తీరు వలన ఇతర రాష్ట్రాలలో కూడా పునరుత్పాదక విద్యుత్ రంగంలో అలజడి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తున్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close