ఆ నలుగుర్ని కేసీఆర్‌ కేబినెట్‌లోకి తీసుకుంటే కులాల కుంపటే..!?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాజకీయంగా తలపండిపోయిన వ్యక్తి. ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే.. ముందుగా.. ఆ నిర్ణయాన్ని ప్రజల్లోకి పంపి.. ప్రజాస్పందనను పరిశీలించి.. ఆనక నిర్ణయం తీసుకుంటారు. ముందస్తు ఎన్నికల దగ్గర్నుంచి ప్రతీ విషయంలోనూ కేసీఆర్ అదే ఫార్ములా పాటించారు. ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గం విషయంలోనూ అదే ఫార్ములా పాటిస్తున్నారు. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని… నలుగుర్ని తీసుకోబోతున్నారని.. నమస్తే తెలంగాణ కన్నా.. ఎక్కువగా.. టీఆర్ఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న సాక్షి మీడియా ప్రముఖంగా ప్రచారం చేస్తోంది. ఆ నలుగురు మంత్రులూ అగ్ర సామాజికవర్గాలకు చెందిన వారే. కమ్మ సామాజికవర్గం నుంచి తుమ్మల, వెలమ సామాజికవర్గం నుంచి హరీష్, కేటీఆర్, రెడ్డి సామాజికవర్గం నుంచి.. సబితా ఇంద్రారెడ్డిని తీసుకోవాలనకుంటున్నట్లుగా సాక్షి జనంలోకి ఫీలర్ పంపింది. ఆ తర్వాత మరో రెండు బెర్తులు ఖాళీ అవుతాయని… వాటిని గతంలో మాటిచ్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డికి ఇస్తారని సాక్షి మీడియా చెబుతోంది.

నిజానికి కేబినెట్ విస్తరణపై కేసీఆర్ చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. సామాజికవర్గాలు, ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం ఆధారంగా కేసిఆర్ గత కేబినెట్ లో టీంను ఎంపిక చేసుకున్నారు. అయితే కొంత మంది విషయంలో ఆయన ఒకింత అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో ఇంఛార్జిలుగా ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రుల విషయంలో కొంత కోపంగా ఉన్నట్లు సమాచారం. పరిషత్ ఎన్నికల ఫలితాలు కేసిఆర్ కోపాన్ని కొంత తగ్గించినట్లైంది. హరీష్, కేటిఆర్ ను పక్కాగా కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఆయనకు తిరిగి పాత శాఖలనే అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి సభితా ఇంద్రారెడ్డి కి కెబినెట్ బెర్త్ ఖాయమైంది. ఆ హామీ మేరకే ఆమె కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ గుటికి చెరుకున్నారు.

అయితే సాక్షి చెప్పినట్లుగా.. వచ్చే ఆరు బెర్తుల్లో మూడు రెడ్లు, రెండు వెలమ, ఒకటి కమ్మలకు ఇస్తే.. సామాజిక సమీకరణాలు దెబ్బతింటాయి. మాదిగ, మున్నూరు కాపు, ఎస్టీ సామాజిక వర్గాలనుండి ప్రాతినిధ్యం లేదు. సత్తుపల్లి టిడిపి ఎమ్మెల్యేగా గెలుపొంది టిఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయిన సండ్ర వెంకట వీరయ్య పేరు ప్రచారంలోకి వచ్చినా.. చివరికి… తుమ్మల పేరు ఫైనల్ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి గత కేబినెట్ లో జోగు రామన్న మంత్రి గా ఉన్నారు. అయితే తొలి విడత కేబినెట్ లో కేసిఆర్ అవకాశం ఇవ్వలేక పోయారు. జోగు రామన్న, దానం నాగేందర్, బాజిరెడ్డి గోవర్ధన్, దాస్యం వినయ్ భాస్కర్ ఇదే సామాజికవర్గానికి చెందిన నేతలుగా ఉన్నారు. కేబినెట్ బెర్తులపై సాక్షి ప్రచారానికి టీఆర్ఎస్ లో పెద్దగా అసంతృప్తి కనబడకపోతే.. వారినే కేసీఆర్ ఫైనల్ చేసే అవకాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close