తగ్గించలేని స్థితికి కులం క్యాన్సర్..! వ్యాక్సిన్‌కూ ముద్ర..!

ఆంధ్ర అంటే ప్రపంచం అంతా చెప్పుకునేలా చేయడంలో ఆంధ్రులు ఎప్పుడూ వెనుకబడటం లేదు. గతంలో గొప్పగా చెప్పుకునేవారేమో ఇప్పుడు మాత్రం.. వారి కుల చేష్టలతో ప్రపంచం మొత్తం అదోరకంగా చూసుకునేలా చేసుకుంటున్నారు. దేశంలోఅందుబాటులోకి వచ్చిన రెండు వ్యాక్సిన్లలో ఒకటి హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ చేసింది. ఎల్లా ఫ్యామిలీ ఆ కంపెనీకి ఓనర్లు. వ్యాక్సిన్ల తయారీలో మంచి ట్రాక్ రికార్డు.. 123 దేశాలకు ఎగుమతులు చేసే హిస్టరీ ఉన్న ఆ కంపెనీ … కోవాగ్జిన్ తయారు చేసింది. మూడో దశ ట్రయల్స్ పూర్తి కాక ముందే.. కేంద్రం అత్యవసర మెడికల్ వినియోగానికి అనుమతి ఇవ్వడానికి వాటినీ ప్రజలకూ పంపిణీ చేస్తోది. అయితే.. కోవీషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చే వారిలా కాకుండా… కోవాగ్జిన్ తీసుకునేవారి దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నారు. అంతే.. ఈ సందు దొరికింది కదా అని వ్యాక్సిన్‌పై ఓ రకమైన ప్రచారం ప్రారంభించారు. ఆ ప్రచారం అదో ఇదో అయితే అనుకోవచ్చు కానీ… నేరుగా కులం ముద్ర వేసేశారు.

భారత్ బయోటెక్ సంస్థ యజమానులు కమ్మ వారని.. వ్యాక్సిన్ పై కులం ముద్ర వేసి.. నెగెటివ్ ప్రచారం ప్రారంభించేశారు కొంత మంది ఏపీలోని సోషల్ మీడియా సైనికులు. ఏ వ్యాక్సిన్ వేసుకున్నా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్ వస్తే.. అది కోవాగ్జిన్ వల్లేనని కమ్మ వ్యాక్సిన్ వేసుకోవద్దని ప్రచారం ప్రారంభించాు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ పోస్టులు చూసి.. ఏపీలో కులం క్యాన్సర్ ఎంతగా ముదిరిపోయిందో ప్రత్యేకంగా టెస్టులుచేయాల్సిన అవసరం లేదని.. అవే సాక్ష్యమని నిట్టూర్చాల్సిన పరిస్థితి. ఎల్లా ఫ్యామిలీ తెలుగు వారు కాదు… తమిళులు. వారు హైదరాబాద్‌లో జీనోమ్ వ్యాలీ పెట్టినప్పుడు… అప్పటి ప్రభుత్వం అనుకూలమైన వాతావరణం కల్పించిందని వచ్చి సంస్థను ప్రారంభించారు. నిరంతర పరిశోధనలతో అభివృద్ధి సాధించారు.

వారు రామోజీరావు కుటుంబంతో ఇటీవల బంధుత్వం కలుపుకున్నారు. దీంతో వారిని ఆ కులం కేటగిరిలో వేసి.. వ్యాక్సిన్‌పై దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. వ్యాక్సిన్‌కు కులం ఏమిటో చాలా మందికి అర్థం కాని పరిస్థితి. కొన్ని వందల మంది కులాలు.. మతాలకు అతీతమైన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తేనే వ్యాక్సిన్ వస్తుంది. అయినప్పటికీ.. దానికిఓ కులం ఆపాదించి.. నెగెటివ్ ప్రచారం చేయడం వల్ల…మొత్తం వ్యాక్సిన్లపై ప్రజలు నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. కులం అనేది ఏపీలో ఎంత దారుణమైన పరిస్థితులకు కారణం అవుతుందో.. తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. చదువుకున్న ప్రజలు పెరిగే కొద్దీ.. ఈ పరిణామం రావడం ఆశ‌్చర్యకరమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close