పెట్టీ కేసుతో కోర్టుకెళ్లిన పోసానికి ఉరి శిక్ష పడేలా వాదించే లాయర్ సప్తగిరి క్యారెక్టర్ ఉన్న సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ సప్తగిరి క్యారెక్టర్ ఇప్పుడు నిజంగానే ఉంది. ఎవరో కాదు మన మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆయనకు సుప్రీంకోర్టులో వాదించేందుకు అర్హత లేదు కానీ దిగువ కోర్టులో ఆయన చేసిన వాదనలతో సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్‌కు అరెస్టు గండం ఖాయమయింది. రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసులో అప్పటి దర్యాప్తు అధికారి విజయ్ పాల్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ కేసుపై సోమవారం విచారణ జరిగింది. విచారణ ప్రారంభమైన కాసేపటికి ధర్మాసనం విజయ్ పాల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఎందుకంటే.. ఈ కేసు విషయంలో గతంలో హైకోర్టును పొన్నవోలు సుధాకర్ రెడ్డి బెదిరించడమే. ఆయన హైకోర్టులో వాదనలు వినిపించమంటే జడ్జిల్ని బెదిరించారు. అప్పట్లో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. ఇదే విషయాన్ని రఘురామ తరపు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పొన్నవోలు నిర్వాకంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్చర్యపోయింది. ఆ అంశంపై విజయ్ పాల్ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే ఆయన వద్ద సమాధానం లేకుండా పోయింది. దీంతో పిటిషన్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అసలు నిజంగా లాయరో కాదో అన్న డౌట్ ఆయన మాటల్ని విన్న వారికి ఎవరికైనా వస్తుంది. లా పై కనీస పరిజ్ఞానం కూడా ఉండదని ఆయన మీడియాతో మాట్లాడిన ప్రతి సారి అవగతమవుతూనే ఉంటుంది. దీనికి తోడు జడ్జిల్ని బెదిరించడం కూడా ఒకటి. ఈయన చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్టు చేసినప్పుడు సిద్దార్థ లూధ్రా వాదనలను కాదని చంద్రబాబును రిమాండ్ కు పంపించేలా వాదించారని నమ్మాలి.
కొడాలి నాని అడ్రస్ లేకుండాపోయారు కానీ ఆయన గుడివాడలో చేసిన దోపిడీ మాత్రం సాక్ష్యాలతో బయటకు వస్తోంది. తాజాగా ఆయన జగనన్న కాలనీలకు మెరక పేరుతో దోచేసిన వైనం వెలుగులోకి వచ్చింది.దీన్ని చూసి ఇలా కూడా దోచుకోవచ్చా అని విలిజెన్స్ అధికారులు ముక్కును వేలేసుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నేమ్ రోల్ కేసులు నమోదు చేసి చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గంలో జగనన్న కాలనీల పేరుతో చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు. ఐదు లక్షలు విలువచేయని స్థలాలను ముఫ్పై లక్షలకుకొన్నారు. మళ్లీ వాటికి మెరక వేయాలని మట్టి తవ్వుకొచ్చారు. ఇలా ఒక దానిపై ఒకటి అవినీతి చేసుకుంటూ పోయారు. గుడివాడ నియోజకవర్గంలో అరకొర మెరక పోసి డబ్బులు కొట్టేసినట్లుగా తెలుస్తోంది. ఇదంతా కొడాలా కనుసన్నల్లోనే జరిగినట్లుగా విజిలెన్స్ ఆధారాలు గుర్తించినట్లుగా తెలుస్తోంది. కొడాలి నాని చేసిన అవినీతికి సంబంధించి చాలా విచారణలు గోప్యంగా జరుగుతున్నాయి. వాటిపై పక్కా ఆధారాలు సేకరించి అరెస్టులు చేయనున్నారు. రాజకీయాలకు ఆయనదూరంగా ఉన్నా…రాజకీయ సన్యాసం తీసుకున్నానని మీడియాకు లీకులు ఇచ్చినా ఆయనను వదిలి పెట్టే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలపై భారం పడుతున్న అదాని విద్యుత్ ఒప్పందాల్ని రద్దు చేసే దిశగా ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ మేరకు విద్యుత్ శాఖతో జరిగిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని పెట్టుబడులపై ప్రభావం పడకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే వివాదం లేకుండా రద్దు చేసేందుకు అవసరమైన మార్గాల్ని అన్వేషిస్తున్నారు. పెట్టుబడులపై ప్రభావం పడకుండా నిర్ణయాలు అదాని విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది అంతర్జాతీయ వార్త అవుతుంది. ఎందుకంటే ఇది బయట పెట్టింది అమెరికా. పూర్తిగా భారత్ లో వ్యవహారానికి సంబంధించినది. అమెరికా బయట పెట్టిన విషయాలు నిజమా కాదా అనేది తెలుసుకోవడానికి అంతర్గత విచారణ చేయకుండా పూర్తిగా ఆ దేశాన్ని గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకునే చాన్స్ లేదు. అందుకే ప్రభుత్వం ఒప్పందాలను వడపోస్తోంది. వాటిని చేసుకోవాల్సిన పరిస్థితులు ఎలా వచ్చాయో ఆరా తీస్తోంది. ప్రజలపై భారం వేసే ఒప్పందాలు రద్దు మొత్తంగా ఇవాళ కాకపోతే ప్రజలపై పాతికేళ్ల పాటు భారం వేసే ఒప్పందాలను రద్దు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలా రద్దు చేస్తే జగన్ రెడ్డికి అదానీకి ఇచ్చిన లంచం వెనక్కి ఇవ్వాల్సిందే. ఇదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా ఏపీ ప్రభుత్వం ఆరా తీస్తోంది. అదానీకి ఎంత పలుకుబడి ఉన్నా.. ఆయనపై తీసుకునే చర్యలతో ఏపీ ప్రభుత్వమే నిర్ణయాత్మకంగా మారనుంది. బీజేపీతో గతంలోలా సన్నిహిత సంబంధాలు లేని అదాని ? ప్రస్తుతం కేంద్రంలోనూ టీడీపీ ప్రభుత్వమే ఉంది. అదాని విషయంలో కేంద్రం వ్యవహరించే విధానమే కీలకం. గత ఎన్నికలకు ముందు అదానీపై ప్రధాని మోదీ కూడా విమర్శలు చేశారు. అదానీకి మీడియాసంస్థల్లో మోదీకి ప్రచారం ఆపేశారు. ఇప్పుడు ఇరువురి మధ్య అలాంటి బంధాలు లేకపోతే ఖచ్చితంగా కేంద్రం కూడా సంచలన నిర్ణయంతీసుకోవడం ఖాయమని అనుకోవచ్చు.