అందుకే సిగ‌రెట్ కాల్చాను : కేథ‌రిన్‌

ఈమ‌ధ్య క‌థానాయిక‌లు బోల్డ్ పాత్ర‌ల్లో న‌టించ‌డానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే… కాస్త ధైర్యం చేసి న‌టిస్తే… బోల్డంత పేరు తీసుకొచ్చేవి ఆ టైపు పాత్ర‌లే! బాలీవుడ్ తెర‌పై క‌థానాయిక‌లు మందు కొట్ట‌డం, ద‌మ్ములాగ‌డం కామ‌నే గానీ, తెలుగు తెర‌పై ఇంకా ఆ వాతావ‌ర‌ణం ఉధృతం కాలేదు. అయితే.. కేథ‌రిన్ మాత్రం ఓ సినిమాలో ద‌మ్ము కొట్టేసింది. సిగ‌రెట్ పొగ‌లు వ‌దులుతూక‌నిపించింది. ఆ సినిమానే ‘నేనే రాజు నేనే మంత్రి’. తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కాజ‌ల్‌తో పాటు, కేథ‌రిన్ కూడా ఓ క‌థానాయిక‌గా క‌నిపించ‌నుంది. ఇందులో కేథ‌రిన్‌ది కాస్త నెగిటివ్ ల‌క్ష‌ణాలున్న పాత్ర‌. ఆ పాత్ర బాగా పండ‌డానికి ఓ స‌న్నివేశంలో దమ్ములాగాల్సివ‌చ్చింద‌ట‌. తేజ చెప్ప‌డం.. కేథ‌రిన్ ఆచ‌రించ‌డం జ‌రిగిపోయాయి. తాను పొగ త్రాగ‌డాన్ని స‌మ‌ర్థించుకొంది కేథ‌రిన్‌.

”స‌న్నివేశం అలాంటిది. అందుకే సిగ‌రెట్‌కాల్చాను. అయితే నిజ జీవితంలో మాత్రం సిగ‌రెట్ తాగింది లేదు. అమ్మాయిలు సిగ‌రెట్లు కాల్చితే న‌చ్చ‌దు. తెర‌పై కాబ‌ట్టి పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించ‌డంలో త‌ప్పు లేదు” అని చెబుతోంది. ఈ వారం విడుద‌ల కాబోతున్న ‘గౌత‌మ్ నంద‌’లోనూ కేథ‌రిన్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ‘జ‌య జాన‌కి నాయ‌క‌’లో ప్ర‌త్యేక గీతం చేసింది కేథ‌రిన్‌. ఈ మూడు సినిమాలూ 15 రోజుల వ్య‌వ‌ధిలో రాబోతున్నాయి. సో.. ఈ ప‌క్షం రోజులూ కేథ‌రిన్ కెరీర్‌కి చాలా కీల‌కం. ఒక్క హిట్టు ద‌క్కినా చాలు.. మ‌రో నాలుగు సినిమాల్ని సంపాదించుకోగ‌ల‌దు. ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close