కేథ‌రిన్‌కి అంత సీన్ ఉందా??

ఇటీవ‌ల స‌రైనోడులో లేడీ ఎమ్మెల్యేగా క‌నిపించింది కేథ‌రిన్‌. ఆ పాత్ర‌కున్న ప్రాధాన్యం, అందులో కేథ‌రిన్ చూపించిన విన్యాసం అంతంత మాత్ర‌మే. క‌నీసం లిప్ సింక్ క‌రెక్ట్‌గా ఇవ్వ‌డానికి కూడా మొహ‌మాట‌ప‌డిపోయింది కేథ‌రిన్‌. ఆ సినిమా హిట్ట‌యినా కేథ‌రిన్‌ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకొన్న పాపానికి పోలేదు. అయితే.. ఇప్పుడు కేథ‌రిన్ పేరు మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. ఈసారి ఏకంగా చిరంజీవి సినిమాలో స్పెష‌ల్ రోల్ చేసే అవ‌కాశం ద‌క్కింద‌ని చెప్పుకొంటున్నారు. చిరంజీవి 150వ చిత్రం క‌త్తిలాంటోడు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఇంకా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవ‌రన్న‌ది ఫైన‌లైజ్ అవ్వ‌లేదు. అయితే.. ఓ పాత్ర‌కోసం కేథ‌రిన్‌ని తీసుకొన్నార‌న్న ప్ర‌చారం అయితే జోరుగా సాగుతోంది. కొన్ని కీల‌క సన్నివేశాల్లో న‌టించ‌డంతో పాటు చిరంజీవితో క‌ల‌సి ఓ పాట‌కు స్టెప్పులేయ‌బోతోంద‌ని టాక్‌.

అయితే కేథ‌రిన్‌కి అంత సీన్ ఉందా? వినాయ‌క్ ఏ న‌మ్మ‌కంతో కేథ‌రిన్‌ని ఎంచుకొంటాడ‌న్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. కేథ‌రిన్‌పై ఐరెన్ లెగ్ అనే ముద్ర ఉంది.. పైగా గొప్ప డాన్స‌రేం కాదు… న‌ట‌న కూడా అంతంత మాత్ర‌మే. అలాంట‌ప్పుడు చిరు సినిమాలో ఆమెకు ఛాన్స్ ద‌క్క‌డం అసాధ్యం అన్న‌ది చిరు కాంపౌండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. క‌త్తిలాంటోడులో ఓ స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ ఉంది.. ఐటెమ్ సాంగూ ఉంది. అందుకోసం ఎవ‌రైతే బాగుంటారా అని చిత్ర‌బృందం అన్వేషిస్తోంది. ఆ క‌థానాయిక‌ల జాబితాలో రెజీనా పేరు ముందు వరుస‌లో ఉంది. కేథ‌రిన్ పేరు కూడా చ‌ర్చకు వ‌చ్చుండొచ్చ‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close