కవిత విషయంలో సీబీఐ ఒకలా ఈడీ మరోలా !

సీఎం కేసీఆర్ కుమార్తె కవిత విషయంలో సీబీఐ చాలా ఉదారంగా ఉంటోంది. ఆమెను ప్రశ్నించిన వారి జాబితాలోనూ చూపించడం లేదు. కానీ ఈడీ మాత్రం.. ఎక్కడ అవకాశం వచ్చినా కవిత పాత్రపై బలంగా ఆధారాలతో సహా కోర్టుల్లో కౌంటర్లు వేస్తోంది. వారం కిందట సీబీఐ దాఖలు చేసిన ఓ కౌంటర్ లో కవిత ప్రస్తావనే రాకపోగా.. తాజాగా పిళ్లై బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ లో మాత్రం మొత్తం కవితే చేశారన్నట్లుగా కౌంటర్ వేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌కు సంబంధించి ఇండోస్పిరిట్ వాటాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే అసలైన పెట్టుబడిదారు అని అరుణ్ పిళ్లై అంగీకరించినట్లు ఈడీ వెల్లడించింది. లిక్కర్ పాలసీలో కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య ఒప్పందం, అవగాహన ఉందని పిళ్లై, బుచ్చి బాబు స్టేట్‌‌మెంట్లు ఇచ్చినట్లు తెలిపింది. సౌత్ గ్రూప్‌‌లో ఆమె పాత్ర, నిందితులు అరుణ్ రామ చంద్ర పిళ్లై, బుచ్చిబాబు, సమీర్ మహేంద్రు, మాగుంట రాఘవ, శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, దినేశ్‌‌ అరోరాతో ఉన్న సంబంధాలను వారి స్టేట్‌‌మెంట్ల రూపంలో మెన్షన్ చేసింది. ముఖ్యంగా ఇండో స్పిరిట్ (ఎల్1) కంపెనీలో కవిత ఇన్వెస్ట్ మెంట్‌‌పై పిళ్లై ఇచ్చిన వాంగ్మూలాన్ని వివరించింది.

ఇండో స్పిరిట్ (ఎల్1)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీగా వ్యవహరించినట్లు అరుణ్ రామ చంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది. లిక్కర్ వ్యాపారంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం సిసోడియా, బీఆర్ఎస్ కవితల మధ్య అవగాహన ఉందని కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను ఈడీ ప్రస్తావించింది. అంటే ఈ ముగ్గురూ కలిసే చేశారని చెబుతోంది. ఈ లెక్కన చూస్తే.. కేజ్రీవాల్ కూడా ఇబ్బందుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది.

మరో వైపు శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్ గా మార్చడంలో జగన్ సక్సెస్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. కవితతో పాటు కేజ్రీవాల్ కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే ఈ కేసు కీలక మలుపులు తిరగనుందన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close