సొంత పార్టీకే లక్ష్మినారాయణ మొగ్గు..! 26న ప్రకటన..!!

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. సోమవారం రోజున ఆయన… తన కొత్త పార్టీ జెండా, అజెండాను ప్రకటించబోతున్నారు. మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్‌గా ఉన్న లక్ష్మినారాయణ.. రాజకీయాల్లోకి వచ్చేందుకు స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో పర్యటించారు. అన్ని వర్గాల సమస్యలను పరిశీలించారు. తను పరిశీలిచిన సమస్యలతో ఓ పీపుల్స్ మేనిఫెస్టోను తయారు చేశారు. తన అభిప్రాయాలు, ఆలోచనలకు అనుగుణం ఉండే పార్టీలతో కలసి పని చేసేందుకు సిద్ధమని.. లక్ష్మినారాయణ పదే పదే ప్రకటించారు.

సత్యం కంప్యూటర్స్ కేసు, గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను విచారించి… ఆంధ్రప్రదేశ్‌లో వీవీ లక్ష్మినారాయణ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు. దీంతో ఆయనను తమ పార్టీలోకి తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నేతలు .. ప్రయత్నించారు. రామ్‌మాధవ్ లాంటి నేతలు.. నేరుగానే ఆహ్వానం పంపారు. మరో వైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా.. తమ పార్టీలో చేరి… ఏపీ తరపున బాధ్యతలు తీసుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది. కానీ వీవీ లక్ష్మినారాయణ మాత్రం.. సొంత పార్టీకే మొగ్గు చూపారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలే పార్టీ ప్రధాన అజెండాగా ఉంటుందని ఆయన ఇప్పటికే పలుమార్లు తన ఆలోచనలు చెప్పారు. కడప జిల్లాకు చెందిన లక్ష్మినారాయణ…విద్యాభ్యాసం కర్నూలు జిల్లాలో జరిగింది.

సివిల్ సర్వీస్ అధికారులు పార్టీలు పెట్టడం కొత్త కాదు. ఐఆర్ఎస్ అధికారి అయిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టి.. ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కానీ.. దక్షిణాదిలో మాత్రం అలాంటి ప్రయోగాలు విఫలమయ్యారు. ఐపీఎస్‌లా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని లోక్‌సత్తా పేరుతో కొంత కాలం.. సంస్థను నడిపిన జయప్రకాష్ నారాయణ… ఆ తరవాత దాన్ని పార్టీగా మార్చారు. ప్రజల మద్దతు పొందలేకపోయారు. చివరికి పార్టీలో కుమ్ములాటలు భరించలేక… రాజకీయ పార్టీని విరమిచుకుంటున్నట్లు ప్రకటించారు. మరి వీవీ లక్ష్మినారాయణ రాజకీయ జీవితం.. కొత్త పార్టీతో ఎలా సాగుతుందో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close