తాను చేసిన అప్పును జగన్‌పైకి తోసేసిన చంద్రబాబు..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏడు నెలల్లో రూ. పాతిక వేల కోట్లు అప్పు చేశారంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. ట్వీట్ చేశారు. ప్రభుత్వం అప్పుల మీద బతుకుతోందని.. ఇలా అయితే.. రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలన చేతకాకపోతే… మంచి సలహాలు తీసుకోవాలని సూచించారు కూడా. అప్పులకు సంబంధించి… చంద్రబాబు… సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారు. వీటిలో… ఏడు నెలల్లో రూ. 25వేల కోట్ల అప్పులంటూ.. ఓ పత్రిక ప్రకటించిన ఆర్టికల్ ను జోడించారు. కానీ చంద్రబాబు… ఈ విషయంలో… కాస్త ముందుకు ఆలోచించలేకపోయారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు మాత్రమే అవుతోంది. ఆ పత్రిక తన ఆర్టికల్ ప్రచురించింది.. ఏడు నెలల్లో ఇరవై ఐదు వేల కోట్లు. అంతే కాదు.. ఏప్రిల్‌లోనే.. ఏపీ సర్కార్ చేసిన అప్పుల గురించి.. ఆ ఆర్టికల్‌లో ప్రధానంగా ప్రస్తావించారు. ఏప్రిల్ లో ఒక్క సారే.. రూ. ఐదు వేల కోట్లను.. ఏపీ సర్కార్ అప్పుగా తీసుకుందని… ఇలా తీసుకోవడం ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని .. కేంద్రం కూడా అభ్యంతరం వ్యక్తం చేసిందని ఆ ఆర్టికల్ చెప్పారు. ఏప్రిల్‌లో సీఎంగా ఉంది చంద్రబాబునాయుడే.. ఒక్క నెలలోనే… రూ. ఐదు వేల కోట్లను అప్పుగా తీసుకుంది.. చంద్రబాబు సర్కారే. ఈ విషయాన్ని వివరిస్తూ.. రాసిన ఆర్టికల్ ను చంద్రబాబు తన ట్వీట్ కే జత చేశారు.

ఎన్నికల సమయంలో.. ఎంత అప్పు దొరికితే.. అంత తీసుకుని.. పసుపు కుంకుమ సహా.. వివిధ పథకాల కోసం…ప్రజలకు పంచి పెట్టారని.. విమర్శలు వచ్చాయి. ఇప్పుడు..వాటినే చంద్రబాబు నాయుడు తన ట్వీట్ ద్వారా అంగీకరించినట్లయింది. చంద్రబాబు అడుగడుగునా అప్పు చేసి పోయారని.. ఇప్పుడు.. తమకు అప్పులు దొరకడం లేదని.. ఏపీ సర్కార్ కిందా మీదా పడుతోంది. అయినప్పటికీ… ఆరు నెలల్లోనే ఇరవై వేల కోట్లకుపైగా అప్పులు చేసింది. చంద్రబాబు సర్కార్ ఐదేళ్లలో సగటున చేసిన అప్పు రూ. ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close