విడాకులు, విడిపోవడాలు…పవన్, రేణులే కరెక్ట్

సంవత్సరాల పాటు కలిసి పెరుగుతారు. సంవత్సరాల కాలం కలిసుంటారు. ఒకే మంచం ఒకే కంచం అన్నంత సన్నిహితంగా ఉంటారు. అలాగే సంవత్సరాల పాటు జీవితాన్ని పంచుకుంటారు. ఎన్నో సంతోషకరమైన విషయాలు, ఎంతో ఆనందాన్ని ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకుంటారు. కానీ ఒకసారి విడిపోవాల్సిన పరిస్థితులు వస్తే, విభేదాలు వస్తే మాత్రం ఒకళ్ళను ఒకళ్ళు తీవ్రంగా విమర్శించుకుంటారు. మరి కొంతమంది అయితే పిచ్చి తిట్లు తిట్టుకుంటారు. కొన్ని సంవత్సరాల పాటు ఒకళ్ళ విషయంలో ఒకళ్ళు చూపించుకున్న ప్రేమ, అభిమానం మొత్తం గాలికి పోతుంది. గొడవలు మిగులుతాయి. ఆ తర్వాత నుంచి ఒకళ్ళకొకళ్ళు శత్రువులుగా మారిపోతారు. తోబుట్టువులు, బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ లవర్స్, భార్యాభర్తలు……రిలేషన్ ఏదైతేనేం చాలా మంది విషయంలో ఇలానే జరుగుతూ ఉంటుంది.

ఇలాంటి అథమ స్థాయి ఆలోచనలు ఉన్న వాళ్ళే రేణు దేశాయ్‌ని కూడా చెత్త కామెంట్స్‌తో బాధపెడుతూ ఉన్నారు. పవన్ అంటే వ్యతిరేక భావం ఉన్నవాళ్ళందరూ కూడా రేణు దేశాయ్….పవన్ కళ్యాణ్‌ని తిడితే చూడాలని ఆశపడుతున్నారు. రేణు విమర్శలను ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్‌ని ఆడిపోసుకోవాలని ఎదురుచూస్తూ ఉన్నారు. మరోవైపు కొంత మంది పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏమో తెలుగు మీడియాలో రేణు దేశాయ్ పేరు వినిపించకూడదని కోరుకుంటున్నారు. ఆమె ఎక్కడికో వెళ్ళిపోవాలి. పవన్ కళ్యాణ్‌ జీవితానికి సంబంధంచిన డార్క్ మార్క్ రేణు దేశాయ్ అని వాళ్ళు ఫీలవుతున్నారు కాబట్టి ఆ డార్క్ మార్క్ పూర్తిగా అదృశ్యమైపోవాలని ఆశిస్తున్నారు. ఇవన్నీ కూడా పనవ్ అభిమానులం అని చెప్పుకునేవాళ్ళు, పవన్‌ని వ్యతిరేకించే వాళ్ళ దుర్మార్గమైన ఆలోచనలు అంతే.

తోబుట్టువులు, బెస్ట్ ప్రెండ్స్, భార్యాభర్తలు…..విడిపోయాక కూడా కలిసి ఉండకూడదా? కలిసి మాట్లాడుకోకూడదా? శతృవుల్లాగా పోట్లాడుకుంటూ ఉండాలా? జీవితాంతం కలిసి ఉండటం కష్టంగా అనిపించి ఉండొచ్చు కానీ బయటి ప్రపంచంలో ఉన్న చాలా మంది కంటే కూడా ఆయా వ్యక్తుల మనసులకు చాలా దగ్గరైన వ్యక్తులే కదా వాళ్ళిద్దరూనూ. అలాంటప్పుడు విడిపోయాక కూడా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్‌లా ఉంటే అది తప్పెలా అవుతుంది? చిన్ననాటి నుంచి ప్రేమించుకుని, పెళ్ళిచేసుకుని…ఆ తర్వాత విడాకులు తీసుకున్న హృతిక్ రోషన్, సుజానేల మధ్య కూడా ఇప్పుడు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. కొన్ని సంవత్సరాల పాటు జీవితాన్ని పంచుకున్న వాళ్ళు విడిపోయేటప్పుడు తిట్టుకుంటూ విడిపోవాలా? ఆ తర్వాత కూడా శతృవుల్లా పోట్లాడుకోవాలా? కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్‌కి చాలా ఎక్కువ మెచ్యూరిటీ ఉంది. కొంత మంది ఊహించుకుంటూ ఉన్నంత అథమ స్థాయి ప్రవర్తనను పవన్ నుంచి ఊహించలేం. అలాగే రేణు దేశాయ్‌ కూడా తనకంటూ కొన్ని మంచి ఆలోచనలు, జీవితంపైన అవగాహన ఉన్న వ్యక్తే. వాళ్ళిద్దరూ కరెక్ట్‌గానే ఉన్నారు. వాళ్ళే కాదు….ఇంకా చాలా మంది ఉన్నారు. పిల్లల కోసమో, లేక పూర్తిగా శతృవులం అవడం ఎందుకు? అని అనుకుని విడిపోయాక కూడా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దాం అని ఫ్రెండ్స్‌లా ఉంటున్నవాళ్ళు. వాళ్ళంతా ఉన్నతంగానే ఆలోచిస్తున్నారు. కానీ కొంత మంది లేకి మనుషులు, అథమ స్థాయి ఆలోచనలు ఉన్నవాళ్ళే పవన్, రేణులాంటి వాళ్ళను తమ స్థాయికి, కిందకు లాగాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నానా మాటలు అని వాళ్ళను బాధపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు.

సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో కూడా బోలెడన్ని హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ప్రియదర్శన్, ఆయన భార్య, నటి లిజి రీసెంట్‌గా విడాకులు తీసుకున్నారు. ఆ సందర్భంగా లిజి ఓ మంచి మాట చెప్పారు. చాలా మంది జంటలు గౌరవంగా, స్నేహ పూర్వకంగా విడిపోయారని, కానీ తాము మాత్రం అలా చేయలేకపోయామని చెప్పారు. చాలా గొడవలు పడ్డామని చెప్పి బాధపడ్డారు. లిజి మాటలను మనం అర్థం చేసుకోగలిగితే చాలు…….. హృతిక్, సుజానే అయినా, మన దగ్గర పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్‌లు అయినా ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నారో చెప్పడానికి. మీమీ అథమ స్థాయి ఆలోచనలతో, మీ నల్ల కళ్ళద్దాల్లో నుంచి చూస్తూ వాళ్ళకు మకిలి అంటించడానికి ప్రయత్నాలు చేయకండి. చేతనైతే మంచిని నేర్చుకునే ప్రయత్నం చేయండి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...
video

ట్రైల‌ర్ టాక్‌: ఫ్యామిలీమెన్ టూ మెంట‌ల్ మెన్‌

https://www.youtube.com/watch?v=xB7b3RzicUU విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే ఎగ్రెసివ్‌నెస్ గుర్తొస్తుంది. అర్జున్ రెడ్డి నుంచి అది అల‌వాటైపోయింది. అయితే... త‌న‌లో కూల్ & కామ్ పెర్‌ఫార్మ‌ర్ ఉన్నాడు. దాన్ని బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ప‌ర‌శురామ్. 'ఫ్యామిలీస్టార్‌'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close