అయ్యో.. అయ్యో.. అయ్యో.. ఏమిటీ భ‌జ‌న‌

మారుతి ట్రెండ్ సెట్ చేసిన ద‌ర్శ‌కుడు ఎవ్వ‌రూ కాద‌న‌లేని నిజం. చిన్న సినిమాల్ని ఎలా తీయాలో నేర్పించాడు. కానీ.. దాంతో బాగుప‌డిందెవ‌రు? మారుతి మాత్ర‌మే. మారుతిలా ఆలోచించి, మారుతి దారిలో సినిమాలు తీసిన‌వాళ్లెవ్వ‌రూ బాగుప‌డ‌లేదు. ఈరోజుల్లో త‌ర‌వాత‌.. ఆ టైపు క‌థ‌ల‌తో వ‌చ్చిన సినిమాల లిస్టు తీయండి. నిజాలు తెలిసిపోతాయి. మారుతి వ‌ల్ల మారుతి లాభ‌పడ్డాడంతే. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌తో మారుతి రేంజు పెరిగింది. ఇప్పుడు బాబు బంగారం హిట్ట‌యితే ఎక్క‌డికో వెళ్లిపోతాడు. కానీ అంత‌కు ముందే మారుతిని పొగ‌డ్త‌ల‌తో ముంచేశారు అతిథులంతా. బాబు బంగారం ఆడియో ఫంక్ష‌న్‌ లో వ‌క్త‌లు వెంకీని ఎంత పొగిడి పాడేశారో, అంత‌కంటే ఎక్కువ‌గా మారుతిని ఆకాశానికి ఎత్తేశారు.

నాని అయితే.. క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి నిర్వ‌చ‌నం మారుతి.. అనేశాడు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌తో నాని రేంజు పెంచిన ద‌ర్శ‌కుడు కాబట్టి మారుతి పొగిడాడంటే న్యాయం ఉంది. మిగిలిన‌వాళ్లంద‌రిదీ ఇదే ప‌రిస్థితి. దాస‌రి కూడా మారుతి జ‌పం చేయ‌డం ఆశ్చ‌ర్యం అనిపిస్తోంది. ”ఈ రోజుల్లో సినిమా విడుద‌ల చేయ‌డానికి తానెంత క‌ష్ట‌ప‌డ్డాడో నాకు తెలుసు. ఆ సినిమా ట్రెండ్ సృష్టించింది. బాబు బంగారంతో తాను స్టార్ డైరెక్ట‌ర్ అయిపోవ‌డం ఖాయం” అన్నారు దాస‌రి. ఈరోజుల్లో, బ‌స్ స్టాప్‌లు హిట్ట‌య్యాయి స‌రే. కానీ వాటిపై బూతు ముద్ర ప‌డింది. ఆ సంగ‌తి వ‌క్త‌లు మ‌ర్చిపోతే ఎలా??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close