వ‌ర్మ సినిమా… ఇక‌ బ‌య‌ట‌కు రాదా?

‘అమ్మ రాజ్యంలో – క‌డ‌ప బిడ్డ‌లు’ అని పేరు మార్చుకున్న ‘క‌మ్మ రాజ్యంలో – క‌డ‌ప రెడ్లు’ విడుద‌ల కోసం ప్ర‌స‌వ వేద‌న ప‌డుతూనే ఉంది. ఈ సినిమాపై హైకోర్టు ప‌లు పిటీష‌న్లు స్వీక‌రించ‌డం, సెన్సార్ ఇబ్బందుల్లో చిక్కుకోవ‌డం తెలిసిన విష‌యాలే. సెన్సార్ బోర్డు ఈ సినిమాని క్షుణ్ణంగా చూసి, వివాదాలేం లేవ‌ని నిర్దారించుకున్న త‌ర‌వాతే.. సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశించింది. ఈ సినిమాని వీక్షించిన సెన్సార్ బోర్డు చాలా విష‌యాల్లో అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. కొన్ని వ‌ర్గాల్ని, కొంత‌మంది రాజ‌కీయ ప్ర‌ముఖుల్నీ ఈ సినిమాలోని కొన్ని స‌న్నివేశాలు కించ‌ప‌రిచేలా సాగాయ‌ని సెన్సార్ బోర్డు భావించింది. వాటిని తొల‌గించాల‌ని సెన్సార్ బోర్డు సూచించింది. అవ‌న్నీ తీసేస్తే.. క‌థ‌లో పెప్ మొత్తం పోతుంది. కొంత‌మంది ప్ర‌ముఖుల్ని పోలిన పాత్ర‌లు ఈ సినిమాలో ఉన్నాయ‌ని సెన్సార్ స‌భ్యులు గుర్తించారు. వారి నుంచి నో అబ్జెక్ష‌న్ స‌ర్టిఫికెట్ తీసుకోవాల‌ని, అప్పుడే సెన్సార్ చేయ‌డం కుదురుతుంద‌ని చెప్పారట. ఇవ‌న్నీ జ‌ర‌గ‌డం అసాధ్యం. అయితే వ‌ర్మ రీషూట్ చేయాలి, లేదంటే.. యూ ట్యూబ్‌లో నేరుగా విడుద‌ల చేసుకోవాలి. అయితే.. ఈ సినిమాపై ఇప్ప‌టికే బిజినెస్ జ‌రిగిపోయింది. సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కాక‌పోతే… నిర్మాత‌లు ఇప్పుడు బ‌య్య‌ర్ల‌కు ఎదురుడ‌బ్బులు కట్టాల్సివ‌స్తుంది. మ‌రి వ‌ర్మ ఎలాంటి మాస్ట‌ర్ ప్లాన్ వేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close