కాపు రిజర్వేషన్ బిల్లు పై కేంద్ర అభ్యంతరాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు చేసి కేంద్రానికి పంపించడం తెలిసిందే ఇప్పుడు ఆ బిల్లుపై కేంద్రం తమ అభ్యంతరాలు తెలియజేసింది ఇది ఆచరణ సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ పేర్కొంది వివరాల్లోకి వెళితే..

కాపులకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పిస్తామన్న ఎన్నికల హామీ మేరకు ఎపి ప్రభుత్వం ఈ అంశంపై బిసి కమిషన్ వేయసి, రిపోర్ట్ ఆధారంగా అసెంబ్లీ లో బిల్లు పాస్ చేసి, కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. ఎపి లో కాపులకు రిజర్వేషన్ బిల్లు పరిశీలించిన కేంద్ర సిబ్బంది,శిక్షణ శాఖ (DoPT) ఇది ఆచరణ సాధ్యం కాదని కేంద్ర హోం శాఖకు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదని స్పష్టం చేసింది.

అయితే కాపు జె ఎసి నాయకులు సుప్రీం కోర్ట్ తీర్పు మార్గదర్శకమే కానీ నిబంధన కాదని, ఆ తీర్పు లో సరైన వివరణ ఉన్నపుడు కేంద్రం ఆమోదించవచ్చని ఉందనీ అంటున్నారు. మొత్తానికి ఇప్పుడీ అంశం కేంద్ర పరిధి లోకి వెళ్ళిపోయింది. మరి ఎపి ప్రభుత్వాన్ని మరొక సారి కేంద్రం వివరణ కోరుతుందా లేక రాజ్యాంగం లో 9 వ షెడ్యూల్ లో ఈ అంశాన్ని చేర్చడానికి కెంద్రం చొరవ చూపాలని ఎపి కేంద్రాన్ని కోరుతుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]