సోషల్ మీడియాపై కేంద్రం నియంత్రణ..!

సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి స్వరాలు పెరిగిపోతూండటం… ఉద్యమాలకు సోషల్ మీడియా వేదికగా ప్రోత్సాహం లభిస్తూండటంతో కేంద్ర ప్రభుత్వం… కట్టడి చర్యలు తీసుకుంది. సోషల్ మీడియాలో ప్రభుత్వం చెప్పిన పోస్టులను 36 గంటల్లోగా తొలగించాల్సిందేనని కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే.. పోస్టులకు సంబంధించిన ఏదైనా విచారణకు సంబంధించి వివరాలు అడిగితే 72 గంటల్లోగా ఇవ్వాల్సిందేనని తేల్చేసింది. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కొత్త రూల్స్ విడుదల చేశారు. సోషల్ మీడియా అంటే ఇండియాలో ప్రధానంగా ఫేస్‌బుక్, ట్విట్టర్‌లే ఉంటాయి. మిగతా నెట్‌వర్క్‌లు ఉన్నా అంత పాపులర్ కాదు. ఇటీవలి కాలంలో ట్విట్టర్‌తో కేంద్రం లడాయి పెట్టుకుంది. రైతు ఉద్యమానికి ప్రోత్సాహం ఇస్తున్న ట్విట్టర్ హ్యాండిళ్లను తొలగించాలని.. పోస్టులను డిలీట్ చేయాలని కేంద్రం ట్విట్టర్‌ను ఆదేశించింది. అయితే ట్విట్టర్..అవి అభ్యంతరకర ట్విట్టర్ ఖాతాలు కాదని చెప్పి తీసేయడానికి నిరాకరించింది.

దీంతో సోషల్ మీడియాపై నియంత్రణ విధించకపోతే.. తమకు ఇబ్బంది ఎదురవుతుందని అనుకున్న కేంద్రం… అప్పటికప్పుడు కసరత్తు ప్రారంభించి ఆంక్షలను సిద్ధం చేసింది. సోషల్ మీడియా హైప్‌తోనే భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకూ భారీ విజయాలు నమోదు చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ సోషల్ మీడియాలోనే ప్రభుత్వ వ్యతిరేకత వెల్లువెత్తుతూండటంతో కంట్రోల్ చేయాలని తపిస్తోంది. కేంద్రం చెప్పిన పోస్టులను తొలగించాల్సిందేనని ఉత్తర్వులు ఇవ్వడం వల్ల.. ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన పోస్టులను తొలగించాలని అదే పనిగా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. అదేసమయంలో భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగం.. ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో దిట్టగా పేరు ఉంది. బీజేపీ చేసే ప్రచారాలను తొలగించాలని బీజేపీ అడగదు కాబట్టి.. వారు చెప్పే న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాకే కాదు.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా నియంత్రణ విధించారు.

ప్రభుత్వం చెప్పినట్లుగా చేసి.. స్వీయ నియంత్రణ పాటించకపోతే.. మరో రెండు దశల్లో చర్యలు తీసుకుంటారు. రెండో దశలో సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో నియంత్రణ సంస్థ.. మూడో దశలో మంత్రుల కమిటీ నియంత్రణ ఉంటుంది కేంద్ర మంత్రి ప్రకటించారు. సినిమాల తరహాలో ఓటీటీ కంటెంట్‌కు సైతం సెన్సార్ ఉంటుంది. మొత్తానికి బీజేపీ తాము ఏ వ్యవస్థ ఆసరాగా ఎదిగామో.. ఆ వ్యవస్థపై ఆంక్షలు విధించడం ద్వారా కేంద్రం.. పక్షపాతం చూపించిందనన్న విమర్శలు ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close