ప్రధానికి తెలంగాణ ఒక్కటే కనిపిస్తోందా..? ఏపీ ఇండియాలో ఉన్న సంగతి మర్చిపోయారా..?

వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్న కేంద్రం.. ఇప్పుడు మరోసారి ఏపీని అవమానించింది. తెలంగాణకు రూ. 450 కోట్లను విడుదల చేసి ఏపీ విషయాన్ని పెండింగ్ లో పెట్టింది. అసలు ఏపీ గురించి ఆలోచనే లేదన్నట్లుగా కేంద్రం స్పందిస్తోంది. తెలంగాణకు వెనుకబడిన జిల్లాలకు చెల్లించాల్సిన నిధుల కింద రూ. 450 కోట్లను వారం క్రితమే విడుదల చేసింది. నిధులు విడుదల చేసిన వారానికి ఉత్తర్వులు రిలీజ్ చేసారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ ఏడాది మార్చిలో మొత్తం ఏడు జిల్లాలకు విడుదల చేసిన 350 కోట్లను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అంతకుముందు విడుదల చేసిన నిధులకు సంబంధించిన యూసీలు, ఖర్చుల వివరాలు అందించని కారణంగా వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రం గతంలో వెల్లడించింది. దీంతో తక్షణమే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలాఖరు కల్లా యూసీలు, ఖర్చుల వివరాలను అందించింది. ఆర్నెళ్లు గడుస్తున్నా ఈ నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకోవడం అంటే ఏపీని అవమానించడమేనని టీడీపీ తీవ్ర స్థాయిలో నిరసన తెలిపింది. విభజన చట్ట ప్రకారం రాయలసీమలో 4, ఉత్తరాంధ్రలో మూడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. అదీ మధ్యప్రదేశ్‌-యూపీ బుందేల్‌ఖండ్‌, ఒడిసా కేబీకే తరహా ప్యాకేజీ ఇవ్వాలి. కానీ జిల్లాకు యాభై కోట్ల చొప్పున విడుదల చేస్తున్నారు. అవి కూడా మూడేళ్లు ఇచ్చి నాలుగో ఏడు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారు. అసలు ఏపీ ఖాతాలో నిధులు వేసిన తర్వాత.. ప్రధానమంత్రి అంగీకరించలేదన్న కారణంగా వెనక్కి తీసుకున్నారు. తర్వాత యూసీలు సమర్పించలేదని కారణంగా చెప్పారు. అసలు యూసీలు సమర్పించిన తర్వాతే నిధులు విడుదల చేస్తారని.. చేసిన తర్వాత వెనక్కి తీసుకోవడం ఏమిటని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఏపీపై.. కేంద్రం కక్ష గట్టిందని.. ఇప్పటికే టీడీపీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇలాంటి సమయంలో కూడా… కేంద్రం ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ పట్ల ఓ రకంగా.. ఎన్నికలు లేని.. ఏపీ పట్ల మరో రకంగా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింతరాజకీయ రగడ చోటు చోటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఏపీపై కేంద్రం కక్ష కట్టిందనే విమర్శలను తనకు తానే నిజం చేసుకుంటోంది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close