వైజాగ్, విజయవాడ మెట్రోలకి కేంద్రప్రభుత్వమే నిధులు ఇస్తుందా?

ఏపిలో తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రకటించిన ప్రాజెక్టులలో విశాఖ, విజయవాడ,తిరుపతి మెట్రో రైల్ ప్రాజెక్టులున్నాయి. ఈ మెట్రో ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న మెట్రో నిపుణుడు శ్రీధరన్ తిరుపతి ప్రాజెక్టు లాభదాయకం కాదని చెప్పడంతో ప్రభుత్వం ఆ ఆలోచన విరమించుకొంది.

ఆ తరువాత కేంద్రప్రభుత్వం, 20 లక్షల మంది కంటే తక్కువ జనాభా ఉన్న విజయవాడలో మెట్రో లాభదాయకం కాదు కనుక దానికి నిధులు మంజూరు చేయదలచుకోలేదని తేల్చి చెప్పడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ కి చెందిన జైకా సంస్థతో మాట్లాడి రూ.2,000 కోట్లు రుణం సమకూర్చుకొన్నట్లు చెప్పారు. ఆ ప్రక్రియ దాదాపు కొలిక్కివచ్చినట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి కూడా.

ఇక విశాఖ మెట్రో ప్రాజెక్టుపై సర్వే జరిపిన తరువాత మళ్ళీ దాని గురించి ఎవరూ మాట్లడకపోవడంతో అదీ ఆరంభం కాకుండానే పట్టాలు తప్పిందని అందరూ భావిస్తున్నారు. కానీ దాని కోసం బడ్జెట్ లో కేవలం లక్ష రూ.లు కేటాయించడాన్ని తెదేపా ఎంపిలు పార్లమెంటులోనే కేంద్రప్రభుత్వాన్ని ఎద్దేవా చేసినప్పుడు అది ఇంకా బ్రతికే ఉందనే సంగతి అందరికీ తెలిసింది. ఏడాదికి లక్ష రూపాయల చొప్పున కేటాయిస్తే దానిని ఎప్పటికి పూర్తి చేయాలనుకొంటున్నారని నిలదీశారు. అప్పుడు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ జవాబిస్తూ దాని క్లియరెన్స్ పనులు తుది దశలో ఉన్నాయని చెప్పారు.

అంటే వైజాగ్ మెట్రో ప్రాజెక్టుని పూర్తి చేయాలనే చిత్తశుద్ధి కేంద్రప్రభుత్వానికి ఉన్నా లేకపోయినా, దానిని మిగిలిన హామీలలాగ ఏదో ఒక కుంటి సాకు చెప్పి ఇంకా పక్కన పెట్టలేదని స్పష్టం అవుతోంది. ఈ రెండు ప్రాజెక్టులపై శ్రీధరన్ స్వయంగా సర్వేలు చేసి సమగ్ర నివేదికలు కూడా తయారు చేశారు. అయితే వీటిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు స్పష్టత ఈయలేదు.

విశాఖ భాజపా ఎంపి కంబంపాటి హరిబాబు అడిగిన ఒక ప్రశ్నకి ప్రణాళికా శాఖా మంత్రి రావు ఇందర్ జిత్ సింగ్ ఈరోజు లోక్ సభలో ఇచ్చిన సమాధానంతో వాటిపై కొంత స్పష్టత వచ్చినట్లయింది. “విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులపై సర్వే పూర్తయింది. విజయవాడలో రెండు కారిడార్స్ లో 26 కి.మీ. పొడవులో నిర్మించబోయే మెట్రో ప్రాజెక్టు రూ. 5, 815 కోట్లు ఖర్చు అవుతాయి. అలాగే విశాఖలో మూడు కారిడార్లలో మెట్రో ప్రాజెక్టు నిర్మించబడుతుంది. ఇది 42 కి.మీ పొడవు ఉంటుంది. దీనికి రూ.10,617 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాము. వీలైనంత త్వరగా రెండు ప్రాజెక్టులని నిర్మిస్తాము,” అని కేంద్రమంత్రి సమాధానం చెప్పారు. అంటే రెండు మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికయ్యే ఖర్చు కేంద్రప్రభుత్వమే భరించబోతోందని భావించవచ్చు. కానీ ఇప్పటికే సుమారు రెండున్నరేళ్ళు పూర్తవుతున్నాయి. ఇంకా ఎప్పుడు వాటికి మోక్షం లభిస్తుందో, నిర్మాణపనులు ఎప్పుడు మొదలుపెడతారో, అవెప్పుడు పూర్తవుతాయో ఈలోగా తెదేపా-భాజపాలు తెగతెంపులు చేసుకొంటే వాటి గతి ఏమవుతుందో ఎవరికీ తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

భీమవరం రివ్యూ : రౌడీ రాజకీయానికి గడ్డు కాలమే !

ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. పవన్ కల్యాణ్ ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోయినా అంది దృష్టి ఈ నియోజకవర్గంపై ఉంది. తాను నామినేషన్ వేసినా పవనే అభ్యర్థి అని ...

కాంగ్రెస్‌తో కాదు రేవంత్ తోనే బీజేపీ, బీఆర్ఎస్ పోటీ !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ...

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close