కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

డిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ చేతిలో భాజపా రెండుసార్లు దెబ్బతింది కానీ అప్పటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కేంద్రం చేతిలో వరుసగా ఎదురుదెబ్బలు తింటూనే ఉంది. వచ్చే ఏడాది జరుగునున్న పంజాబ్ శాసనసభ ఎన్నికలలో మళ్ళీ ఆ రెండు పార్టీలు తలపడనున్నాయి కనుక రోజురోజుకీ వాటి మద్య యుద్దం తీవ్రం అవుతోంది.

కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై ఎసిబి అధికారులు ఎఫ్.ఐ.ఆర్.నమోదు చేయడంతో అది మరింత తీవ్రతరం అయ్యింది. తాజాగా డిల్లీ శాసనసభ ఆమోదించిన 14 బిల్లుల్ని కేంద్ర హోంశాఖ వెనక్కి తిప్పి పంపేసింది.

డిల్లీ కేంద్రపాలిత ప్రాంతమైనందున ముందస్తు అనుమతి లేకుండా బిల్లులు ఆమోదించే హక్కు లేదు కనుక వాటిని వెనక్కి తిప్పి పంపుతున్నట్లు హోంశాఖ తెలియజేసింది. పద్ధతి ప్రకారం వాటి గురించి తమకి మళ్ళీ సమాచారం ఇచ్చి ఆమోదం కోసం పంపినట్లయితే, పరిశీలిస్తామని హోంశాఖ తెలిపింది.

వెనక్కి త్రిప్పి పంపినవాటిలో ఆమాద్మీ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా భావించిన జన్ లోక్ పాల్ బిల్లు కూడా ఉంది. దానిని ఆమోదించినట్లయితే, కేంద్రస్థాయి అధికారులపై కూడా డిల్లీ ప్రభుత్వం అవసరమైతే చట్టప్రకారం చర్యలు చేపట్టే అవకాశం ఏర్పడుతుంది. తన అధీనంలో పనిచేసే ఉద్యోగులపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చర్యలు తీసుకొనే అవకాశం కల్పించాలని కేంద్రం అనుకోదు కనుక ఆ బిల్లుని వెనక్కి తిప్పి పంపివేసిందని భావించవచ్చు.

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి అది ఆగ్రహం కలిగించడం సహజమే. ఆయన ప్రధాని మోడీపై ట్వీటర్ ద్వారా నిప్పులు చెరిగారు. “డిల్లీ శాసనసభకి చట్టాలు చేసే హక్కు లేదా? అది చేసిన ప్రతీ చట్టాన్ని కేంద్రప్రభుత్వం ఈవిధంగా అడ్డుకొంటూనే ఉంటుందా? అడ్డుకోవడానికి కేంద్రం ఏమైనా హెడ్ మాష్టరా? అని ప్రశ్నించారు.

“మా పార్టీ చేతిలో భాజపా ఓడిపోయి ఉండవచ్చు కానీ ఇప్పటికీ అదే మనసులో పెట్టుకొని మా ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించవద్దని నేను మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. నా కోసమో, నా ప్రభుత్వం కోసమో కాదు..డిల్లీ ప్రజల కోసం ఆలోచించి మాకు సహకరించమని కోరుతున్నాను, “ అని అరవింద్ కేజ్రీవాల్ ట్వీటర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.

తెదేపా, తెరాసల రాజకీయ విభేధాల కారణంగా ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు ఏవిధంగా కీచులాడుకొంటున్నాయో, ఆమాద్మీ, భాజపాల వైరం కారణంగా డిల్లీ ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం కీచులాడుకొంటున్నాయి. ఇరు పార్టీల మద్య నెలకొన్న రాజకీయ వైరాన్ని ప్రభుత్వాల మద్యకి ప్రాకించడాన్ని ఎవరూ హర్షించలేరు. వాటి కీచులాటలకి మరో కారణం ఏమిటంటే ఒకే చోట రెండు విభిన్నపార్టీలకి చెందిన ప్రభుత్వాలు కొలువై ఉండటమే. గతంలో కేంద్రంలో యూపియే ప్రభుత్వం, డిల్లీలో మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రభుత్వం పదేళ్ళ పాటు ఎటువంటి సమస్యలు లేకుండా నడిచాయి. అవి రెండూ కాంగ్రెస్ ప్రభుత్వాలు కావడమే అందుకు కారణం. కానీ ఇప్పుడు భిన్న దృవాల వంటి భాజపా, ఆమాద్మీ ప్రభుత్వాలు డిల్లీలో కొలువు తీరడంతో సమస్యలు, సవాళ్లు నిత్యకృత్యం అయిపోయాయి. ఆ రెండు పార్టీల మద్య సయోధ్య కుదిరే అవకాశం లేదు కనుక ఇలాగే తిట్టుకొంటూ సాగవలసిందే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close