ఒకటి-రెండు రోజులలో కేంద్రంనుంచి ప్రకటన: చంద్రబాబు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు మరో మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు రాబోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆయన ఇవాళ సాయంత్రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గత రెండు రోజులలో ఢిల్లీలో కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలలో ఏర్పడిన పురోగతిని వివరించారు. చిత్తూరు జిల్లా శ్రీ సిటీకి అనేక కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. కర్నూలు-అమరావతి రహదారిని జాతీయ రహదారిగా గుర్తిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. రెండు రాష్ట్రాలమధ్య సమస్యలు త్వరగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. గోదావరి-కృష్ణ నదుల అనుసంధానంలో సఫలీకృతమయ్యామని చెప్పారు. కృష్ణా-పెన్నా నదుల అనుసంధానాన్ని చేపట్టబోతున్నామని వెల్లడించారు. విద్యుత్ కొరతను చాలావరకు అధిగమించామని, విద్యుత్‌లో ఏపీ మిగులు రాష్ట్రంగా మారబోతోందని తెలిపారు. పోలవరం పూర్తవ్వాలంటే కేంద్ర సహకారం తప్పనిసరని తెలిపినట్లు పేర్కొన్నారు. గత పదేళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వాల తప్పుడు విధానాలవలన వ్యవసాయం నిర్వీర్యమైపోయిందని అన్నారు. విశాఖకు 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ రాబోతోందని చెప్పారు. ఏపీని ఆర్థికంగా ఆదుకోవాలని కోరామని, దీనిపై కేంద్రం ఒకటి, రెండు రోజుల్లో ప్రకటన చేసే అవకాశముందని చంద్రబాబు తెలిపారు.

కేంద్రం చేస్తుందని చంద్రబాబు చెబుతున్న ప్రకటన వాస్తవానికి ఇవాళే రావాల్సింది. కేంద్రం ఈ సాయంత్రం ఒక ప్రకటన వెలువరిస్తుందని సుజనా చౌదరి ఇవాళ ఉదయం చెప్పారు. అయితే టెక్నికల్ గా ఏదో అవాంతరం ఏర్పడినట్లుంది… ప్రకటన ఇవాళ రాలేదు. నిశితంగా గమనిస్తే 26నుంచి జగన్ చేపట్టిన దీక్షను ఎదుర్కోవటంకోసమే టీడీపీ నేతలు ఇప్పుడు అర్జంటుగా కేంద్రంతో ఈ ప్రకటన చేయిస్తున్నట్లుగా కనబడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close