ఏపీలో ఈ సారి భద్రత లేనట్లే..! తగ్గిపోయిన బలగాలు..!

2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు 290 కంపెనీల బలగాలు వచ్చాయి. అలా వచ్చినా.. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సారి ఓటర్లు పెరిగారు. పోలింగ్ బూత్‌లు పెరిగాయి. కానీ వంద కంపెనీల బలగాలను మాత్రం తగ్గించారు. నక్సల్స్, ఫ్యాక్షన్ వివాదాలు ఉన్న నియోజకవర్గాలకు అదనపు బలగాలు కావాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి రాష్ట్ర డీజీపీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. మొదటి దశలోనే ఎపీ పోలింగ్ ఉండటంతో వేరే రాష్ట్రాల నుంచి బలగాలను ఏపీకి తరలించాలని కోరినా.. ఎన్నికల కమిషన్‌ పట్టించుకోలేదు. ఏపీలో ఈ సారి ఎన్నికలు… చాలా ఉద్రిక్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రచారం సమయంలోనే గొడవలు జరిగాయి. సమస్యాత్మక నియోజకకవర్గాలతో పాటు కొత్తగా అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి.

తమ పార్టీకి మద్దతు పలకని వారిపై ఇప్పటికే అనేక నియోజకవర్గాలలో నేతలు దౌర్జన్యాలకు దిగారు. మరి పోలింగ్‌ రోజు ఎలా వ్యవహరిస్తారు.. ఎలా విజృంభిస్తారన్నది ఇప్పుడు సమస్యగా మారింది. రాష్ట్రంలో ఎన్నికలు ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు 362 కంపెనీల పారామిలటరీ బలగాలు కావాలని కేంద్రానికి ఏపీ పోలీసులు లేఖ రాశారు. ఐతే కేవలం 197 కంపెనీల పారామిలిటరీ బలగాలు మాత్రమే రాష్ట్రానికి పంపారు. ఓ పార్టీకి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి., ఆ పార్టీ ఎక్కడెక్కడ.. బలగాలను మోహరించాలో చెబుతూ.. ఓ నివేదిక కూడా ఈసీకి ఇచ్చింది. దాని ప్రకారమే.. బలగాలను మోహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఓ పార్టీ నేతలు హైకోర్టులో నాలుగు రోజుల కింద పిటిషన్‌ వేశారు. సమస్యాత్మక కేంద్రాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆ పిటిషన్‌లో కోరారు. హైకోర్టు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ప్రస్తుతం హైకోర్ట్‌ ఉత్తర్వుల ప్రకారం తాము సూచించిన సమస్యాత్మక కేంద్రాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆ పార్టీ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. ఇది కూడా వారి పథకంలో భాగమేనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close