ఓట‌మిని వైకాపా అంగీక‌రించింద‌న్న చంద్రబాబు

‘టెక్నాల‌జీని ప్రోత్స‌హించి అభివృద్ధికి మ‌నం వాడుతుంటే, సైబ‌ర్ నేరాల కోసం వైకాపా టెక్నాల‌జీని వాడుతోంద‌’ని మండిప‌డ్డారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. పార్టీ నేతలతో టెలీకాన్ఫ‌రెన్స్ లో ఆయ‌న మాట్లాడుతూ.. ఈ చర్యల ద్వారా ఎన్నిక‌ల ముందే వైకాపా ఓట‌మిని అంగీక‌రించింద‌న్నారు. టీడీపీని ఏం చెయ్యలేని ఫ్ర‌స్ట్రేష‌న్ తో తెలంగాణ‌లో కేసులు పెడుతున్నారంటూ మండిప‌డ్డారు. దాదాపు రెండు ద‌శాబ్దాలుగా పార్టీకి సంబంధించి సేక‌రించి దాచుకున్న స‌మాచారాన్ని కొట్టేయ‌డం కోసం వైకాపా దిగ‌జారుడు చ‌ర్య‌ల‌కు దిగుతోంద‌ని విమ‌ర్శించారు. వారు చేస్తున్న నీచ‌మైన ప‌నికి కోర్టు కూడా మొట్టికాయ‌లు వేసింద‌న్నారు. ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం అసాధ్య‌మ‌ని వైకాపాకి స్ప‌ష్ట‌మైపోయింద‌నీ, అందుకే కేసీఆర్‌, మోడీల‌తో క‌లిసి కుట్ర‌లు చేస్తున్నారంటూ సీఎం ఆరోపించారు. దాదాపు 8 ల‌క్ష‌ల ఓట‌ర్ల‌ను తొల‌గించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జ‌రుగుతోంద‌నీ, దీన్ని స‌మ‌ర్థంగా తిప్పికొడ‌తామ‌న్నారు సీఎం.

తాజా వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్ గానే తీసుకున్నారు ముఖ్య‌మంత్రి. దీనిపై ప్ర‌భుత్వం వైపు నుంచి ఎలాంటి చ‌ర్య‌ల‌కు అవ‌కాశం ఉంద‌నేది స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు స‌మాచారం. డీజీపీ, అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ తో సీఎం చంద్ర‌బాబు భేటీ అయి, దాదాపు గంట సేపు డాటా చోరీ అంశ‌మై ఎలాంటి చ‌ర్య‌ల‌కు వెళ్లొచ్చ‌నేది చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. ఇదే అంశాన్ని పార్టీప‌రంగా కూడా డీల్ చేసేందుకు నేత‌ల‌కు చంద్ర‌బాబు కొన్ని సూచ‌న‌లు చేసిన‌ట్టు స‌మాచారం. పార్టీకి సంబంధించిన డాటా ఎంత కీల‌క‌మైందో, దాన్ని చోరీ చేసేందుక వైకాపా ఎలాంటి కుటిల రాజ‌కీయాలు చేస్తోందో ముందుగా పార్టీలో అన్ని స్థాయిల‌వారికీ వివ‌రించాల‌ని దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. టీడీపీ డాటాను దొంగిలించి, దాన్ని వైకాపాకి అంద‌జేసేందుకు కేసీఆర్ ప్ర‌భుత్వం చేస్తున్న కుట్ర‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని సీఎం చెప్పిన‌ట్టు స‌మాచారం.

తెరాస సాయంతో, ఓట్ల తొల‌గింపున‌కు ఫామ్ 7 ద‌ర‌ఖాస్తుల‌ను పెద్ద సంఖ్య‌లో వైకాపా దాఖ‌లు చేసింద‌నేది టీడీపీ అనుమానం. కాబ‌ట్టి, ఓట‌ర్ల జాబితాకి సంబంధించిన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి, ఈ ప్ర‌హ‌స‌నంలో వైకాపా విమ‌ర్శ‌లు ఎదుర్కొనే దిశ‌గా తెలుగుదేశం వ్యూహం ఉండ‌బోతోంద‌ని అనిపిస్తోంది. ఓట‌ర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌క‌లుంటే… కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చెయ్యాలి. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు సంబంధించిన డాటా లీక్ అవుతోంద‌ని అనుమానం ఉంటే… ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చెయ్యాలి. ఈ రెండూ కాద‌ని… తెలంగాణ ప్ర‌భుత్వానికి వైకాపా ఫిర్యాదు చేయ‌డం వెన‌క ఉద్దేశమేంటి..? ఈ ప్ర‌శ్న‌కు వైకాపా జ‌వాబు చెప్పి తీరాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close