పులిహోరలో కరివేపాకు – ఆర్. కృష్ణయ్య

మనుషులని అవసరమున్నప్పుడు పూర్తిగా వాడేసుకొని అవసరం తీరిన తరువాత పులిహోరలో కరివేపాకులా తీసి పక్కన పడేయడం చంద్రబాబు నాయుడుకి అలవాటు అని రాజకీయ వర్గాలలో ఒక బలమయిన అభిప్రాయం ఉంది. సీనియర్ యన్టీఆర్, జూ.యన్టీఆర్, రోజా, ఆర్. కృష్ణయ్య వంటి వాళ్ళు ఎందరో ఆ లిస్టులో ఉన్నారు. వారిలో ఆర్. కృష్ణయ్య పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. గత ఎన్నికలలో తెలంగాణాలో బీసీ ఓటు బ్యాంకుని కొల్లగొట్టడానికి ఎవరూ ఊహించని విధంగా బీసీ సంఘాల నేత ఆర్. కృష్ణయ్యని హడావుడిగా పార్టీలో చేర్చుకొని పార్టీలో సీనియర్లను కూడా కాదని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించారు. కానీ తెలంగాణాలో తమ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన ఎల్బీనగర్ నియోజక వర్గం నుండి ఎన్నికలలో గెలిచినా ఫలితం లేకపోయింది.

ఒకవేళ తెదేపా-బీజేపీ కూటమి ఎన్నికలలో గెలిచి తెలంగాణాలో అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే అప్పుడు చంద్రబాబు నాయుడు నిజంగానే కృష్ణయ్యను ముఖ్యమంత్రిగా చేసేవారో లేదో తెలియదు కానీ ఎన్నికల తరువాత నుండి ఆయనని పట్టించుకోవడం మానేశారు. చంద్రబాబు నాయుడే పట్టించుకోకపోవడంతో పార్టీలో మిగిలినవారు కూడా ఆయనని పట్టించుకోవడం మానేశారు. చంద్రబాబు నాయుడుకి బీసీల మీద ఎటువంటి ప్రేమ ఉందో ఇది తెలియజేస్తోంది. అవసరం కోసం కృష్ణయ్యను చేరదీసిన చంద్రబాబు నాయుడు ఆ అవసరం తీరగానే పులిహోరలో కరివేపాకులాగ తీసి పక్కన పడేశారు. దానితో షాక్ తిన్న కృష్ణయ్య కూడా క్రమేపీ తెదేపాకు దూరం అయ్యారు. ఒకప్పుడు బీసీ సంఘాల నేతగా మంచి పేరు సంపాదించుకొన్న కృష్ణయ్య ఇప్పుడు రాజకీయ అనామకుడుగా మిగిలిపోయారు.

అయితే అందుకు చంద్రబాబు నాయుడే కారణమని నిందించడానికి కూడా లేదు. బీసీ సంఘాల నేతగా మంచి పోరాట స్ఫూర్తి ప్రదర్శించిన కృష్ణయ్య రాజకీయాలలోకి వచ్చిన తరువాత అదే పోరాట స్పూర్తిని చూపలేకపోయారు. బహుశః పార్టీలో సీనియర్లు ఆయన పైకి రాకుండా అణచివేశారేమో తెలియదు. కానీ కారణాలు ఏవయినా ఆయన పార్టీలో తన ఉనికిని చాటుకోవడంలో విఫలమయ్యారు. ఒకవేళ ఆయనే గనుక తన ఉనికిని చాటుకొనగలిగి ఉండి ఉంటే లేదా రాష్ట్రంలో బీసీలను తెదేపా వైపు తీసుకు రాగలిగి ఉండి ఉంటే, చంద్రబాబు నాయుడు ఆయనను తప్పకుండా ఆధారించి ఉండేవారేమో? కానీ ఆయన దృష్టిని ఆకట్టుకోవడంలో విఫలం అవడంతో కృష్ణయ్య తెదేపా పులిహోరలో కరివేపాకయిపోయారు. ఆ కారణంగా ఆయన తన బీసీ సంఘాల దృష్టిలో కూడా చులకన అయ్యారు.

కానీ బీసీల పట్ల తనకు ఎంతో ప్రేమ ఉందని చెప్పే చంద్రబాబు నాయుడు కృష్ణయ్య పట్ల ఆవిధంగా వ్యవహరించకుండా ఉండి ఉంటే, బీసీ వర్గాలకు చంద్రబాబు నాయుడు పట్ల ఎంతో గౌరవం, నమ్మకం ఏర్పడి ఉండేవి. వచ్చే ఎన్నికల నాటికి దాని వలన తేదేపాకు చాలా మేలు జరిగి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు అలవాటులో పొరపాటుగా క్రిష్ణయ్యను తీసి పక్కన పడేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close