చంద్రబాబు , బాలకృష్ణల మనవడు దేవాన్ష్ అన్నప్రాసన వేడుక

నేడు తిరుమలేశుని సన్నిధిలో నారా చంద్రబాబునాయుడు, నందమూరి బాలకృష్ణల మనవడు దేవాన్ష్ అన్నప్రాసన వేడుక జరుగనున్నది.

Click Here for photos from Annaprasana (Sunday Oct 18th)

ఈ సందర్భంగా కొన్ని గత సంఘటనలు తలుచుకుంటే మధురంగా ఉంటాయి ,మనసుని మురిపిస్తాయి. ఈ ఆర్టికల్ క్రిందన ఇచ్చిన ఫొటోల్లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మురిసిపోతున్న వైనాన్ని చూడటానికి అభిమానులకు రెండు కళ్లూ చాలవు. అన్నగారి మురిపెం అంతా మనవరాలి అన్నప్రాసన కోసమే. నందమూరి బాలకృష్ణ, వసుంధరల ముద్దుల కుమార్తె బ్రాహ్మణి అన్నప్రాసన వేడుక నాటి ఫోటోలు అవి. ఏడుకొండల మీద కొలువుదీరిన తిరుమలేశ్వరుడి సమక్షంలో ఆ వేడుక జరిగింది. మనవరాలిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ప్రేమగా అన్నగారు అన్నప్రాసన చేసిన వైనం కమనీయంగా ఉంది కదూ. అలాగే, మరో ఫొటోలో నారా చంద్రబాబునాయుడు, కూతురు భువనేశ్వరిల పుత్రరత్నం లోకేశ్ కి అన్నప్రాసన చేస్తున్న వైనం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ లో ఈ వేడుక జరిగింది.

కాలచక్రం వేగంగా తిరుగుతోంది. నాడు ఎన్టీఆర్ ఒళ్లో కూర్చోబెట్టుకుని అన్నప్రాసన చేసిన లోకేశ్, బ్రాహ్మణి నేడు దంపతులు.ఇప్పుడు వీరి కుమారుడు దేవాన్ష్ అన్నప్రాసన వేడుక జరగనుంది.నాడు తన తనయుడి కుమార్తెకు అన్నగారు తిరుమలలో అన్నప్రాసన చేశారు. నేడు బాలకృష్ణ తన తనయురాలి కుమారుడు దేవాన్ష్ అన్నప్రాసనను అదే ప్రాంగణంలో చేయనుండటం విశేషం. వెంకటేశ్వరుడి సన్నిధిలో ఆదివారం ఉదయం ఈ వేడుక వైభవంగా జరగనుంది. అటు నారా చంద్రబాబు నాయుడు, ఇటు నందమూరి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. బాలయ్య అప్పుడే తాత అయ్యారా? అనుకోవడానికే ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు తన మనవరాలు, మనవడి అన్నప్రాసన సమయంలో ఓ తాతగా ఎన్టీఆర్ ఎంతటి ఆనందాన్ని అనుభవించి ఉంటారో నేడు తన మనవడి అన్నప్రాసన వేడుకకు ఓ తాతగా బాలయ్య అంతే ఆనందాన్ని అనుభవిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు ప్రజల గుండెల్లో ఓ ఆరాధ్య దైవంలా కొలువుదీరిన అన్నగార్ని ఎవరూ మర్చిపోలేరు. సాక్షాత్తు ఆయన మునిమనవడికి జరగబోతున్న ఈ వేడుక యావత్ నందమూరి అభిమానులకు ఆనందదాయకంగా ఉంటుంది. ఈ సందర్భంగా నాటి అన్నగారి ఫొటోలు ఇలా చూడటం కూడా అమితానందానికి గురి చేసే విషయం

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close