అమిత్ షా వ్యాఖ్య‌ల‌కు చంద్ర‌బాబు కౌంట‌ర్‌..!

కొండ‌వీటి వాగు ఎత్తిపోత‌ల ప‌థ‌కం ప్రారంభం కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఉండ‌వ‌ల్లిలో జ‌రిగిన స‌భ‌లో సీఎం మాట్లాడారు. రాజ‌ధాని నిర్మాణం కోసం స్వ‌చ్ఛందంగా వేల ఎక‌రాల భూమిని రైతులు ఇచ్చి చ‌రిత్ర సృష్టించార‌న్నారు. కానీ, కొంత‌మంది నాయ‌కులు ఇక్క‌డ భూకంపాలు వ‌స్తాయ‌నీ, వ‌ర‌ద‌లు వ‌స్తాయనీ, రాజ‌ధాని మునిగిపోతుంద‌ని లేనిపోని దుష్ప్ర‌చారాలు చేస్తూ విషం చిమ్ముతున్నార‌ని ఆరోపించారు. ఈ మ‌ధ్య ఓ చిన్న వ‌ర్షం ప‌డితే.. రాజ‌ధాని మునిగిపోయింద‌ని కొంద‌రు అన్నార‌నీ, వీళ్ల క‌లా ఆలోచ‌నా రాజ‌ధాని మునిగిపోవాల‌ని ఉందే త‌ప్ప‌, బాగా క‌ట్టాల‌నే ఆలోచ‌న ఏకోశానా లేక‌పోవ‌డం చాలా దుర‌దృష్ట‌క‌రం అన్నారు. భూమి రైతుల ద‌గ్గ‌రుంద‌నీ, దాన్ని సి.ఆర్‌.డి.ఎ. తీసుకోవాల‌నీ, ఆ త‌రువాత ప్లాట్లు వెయ్యాలీ… జ‌ర‌గాల్సింది ఇంత స్ప‌ష్టంగా ప్ర‌జ‌ల ముందు ఉంటే.. ఇక్క‌డేదో అవినీతి జ‌రిగిపోయింద‌ని కొంద‌రు ఆరోపిస్తున్నార‌న్నారు. ఏదేమైనా, కొండ‌వీటి వాగు వ‌ల్ల రాజ‌ధానికి ఎలాంటి ముప్పూ ఉండ‌ద‌న్నారు. ఇక‌పై వ‌ర‌ద అనేదే ఉండ‌ద‌న్నారు.

బాబ్లీ అంశ‌మై త‌న‌కు అరెస్టు వారెంట్ వ‌చ్చిన అంశాన్ని మ‌రోసారి ప్ర‌స్థావిస్తూ… దీనిపై త‌మ‌కు సంబంధం లేద‌ని భాజ‌పా అధ్య‌క్షుడు అమిత్ షా అంటున్నార‌న్నారు. ఈరోజున ఏ ప్ర‌భుత్వం మ‌హారాష్ట్రలో అధికారంలో ఉంద‌నీ, కేంద్రంలో ఎవ‌రున్నార‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు? తాను ప్ర‌జ‌ల కోసం నిర‌స‌న తెలిపాన‌నీ, కాబ‌ట్టి భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌న్నారు. దేశాన్ని దోచేసిన అవినీతిప‌రుల్ని విదేశాల‌కు పంపిస్తార‌నీ, ఇక్క‌డ‌ అవినీతిపరుల‌కు (జ‌గ‌న్ ను ఉద్దేశించి) అండ‌గా నిల‌బ‌డ‌తార‌ని అమిత్ షాని ఉద్దేశించి అన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై తాను పోరాటం మొద‌లుపెట్ట‌గానే… ఎప్పుడూ లేని అంశాల‌ను ఇప్పుడు త‌న‌పైకి తీసుకొచ్చి ఒత్తిడి పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. ఇంకా మాట్లాడాల్సిన విష‌యాలున్నాయ‌నీ, అసెంబ్లీలో చెబుతాన‌ని చంద్ర‌బాబు చెప్పారు.

నిజానికి, చంద్ర‌బాబుకు జారీ అయిన స‌మ‌న్లపై భాజ‌పా నేత‌లు మాట్లాడ‌కుండా ఉంటే కొంత బాగుండేది. ఎవ్వ‌రూ అడ‌క్కముందే వివ‌ర‌ణ ఇచ్చే కార్య‌క్ర‌మాలు వారే పెట్టేసుకుంటున్నారు. రెండ్రోజుల కింద‌ట ఎంపీ జీవీఎల్ ప్రెస్ మీట్ పెట్టేసి… బాబ్లీ అంశ‌మై కోర్టు స్పందిస్తే త‌మ‌కేంటి సంబంధ‌మ‌న్నారు! ఈ విష‌యంపై మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని మీరు అడ‌గాలంటూ పురందేశ్వ‌రి కూడా వ్యాఖ్యానించారు. నిన్న తెలంగాణ వ‌చ్చిన అమిత్ షా కూడా మాకేంటి సంబంధం అంటున్నారు! మ‌హారాష్ట్రలో అధికారంలో ఉన్న‌ది భాజ‌పానే క‌దా. ఓర‌కంగా చూసుకుంటే… ఈ అంశం ఏపీలో భాజ‌పాకి ఇబ్బందిక‌రంగానే మారుతుందన‌డంలో సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close