వరద రాజకీయంలో చిక్కుకున్న చంద్రబాబు నివాసం..!

ఎగువ నుంచి వస్తున్న వరదతో.. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా పరివాహక ప్రాంతాలు ముంపు ముప్పులో పడ్డాయి. శ్రీశైలం నుంచి .. ప్రకాశం బ్యారేజీ వరకు.. పలు చోట్ల… కృష్ణా తీర గ్రామాలు నీటి ముంపులో ఇరుక్కున్నాయి. అయితే.. ఎక్కడా పెద్దగా అధికారుల జాడ కనిపించడం లేదు. గ్రామస్తులు.. చేతికి అందిన సామాన్లతో… వీలైనంత దూరం వెళ్లి ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారు. వారికి కనీస అవసరాలు చూసేవారు కూడా కరవయ్యారు. ప్రభుత్వాధికారులు… కనీసం వచ్చి పలకరించను కూడా పలకరించడం లేదు. దాంతో.. వారి బాధ వర్ణనాతీతంగా ఉంది.

అయితే.. గుంటూరు జిల్లా అధికారులు మాత్రం… ఒక్క చోట పూర్తిగా దృష్టి కేంద్రకరించారు. ఉదయం నుంచి… అ ప్రాంతం దగ్గరకు గుంటూరు కలెక్టర్ సహా.. ఉన్నతాధికారులు హడావుడిగా వచ్చి పరిశీలించి వెళ్లారు. డ్రోన్ కెమెరాలతో.. దృశ్యాలను చిత్రీకరించారు. వరద ముప్పు ఎలా ఉంటుందో.. అంచనా వేసుకున్నారు. అయితే.. ఆ ప్రాంతం… పేదలు నివాసం ఉండే.. ఏరియా కాదు. అక్కడి ప్రజల్ని తరలించే కార్యక్రమం కోసమూ ఆ హడావుడి చేయడం లేదు. వారు అత్యంత ఆసక్తి చూపిస్తున్న అ ప్రాంతం.. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్ భవనం… ఉన్న ప్రాంతం. ఆ ఇంట్లోకి నీళ్లు ఎప్పుడు వస్తాయా.. అన్నట్లుగా.. గంటకోసారి వచ్చి చూసి.. వెళ్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అయితే.. అక్కడే మకాం వేశారు.

బాధితులు ఇతర ప్రాంతాల్లో సాయం కోసం హాహాకారాలు పెడుతున్నా… పట్టించుకోని అధికారులు.. చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందేమో అని మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని అంతకంతకూ పెంచే ప్రయత్నం చేస్తున్నారని… ప్రకాశం బ్యారేజీ నుంచి.. సమయానికి నీళ్లు వదలకుండా… ఈ ప్రయత్నం చేశారని.. టీడీపీ నేతలు.. కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులంతా.. చంద్రబాబు నివాసంపైనే దృష్టి పెట్టారు. డ్రోన్ కెమెరాలతో కూడా చిత్రీకరణ చేయడంతో.. చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది, టీడీపీ నేతలు.. అభ్యంతరం వ్యక్తం చేసి.. ఆందోళనకు దిగారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close