అమరావతి మహిళల్ని వేశ్యలుగా కించపరిచినా సాక్షి టీవీ, కొమ్మినేని, కృష్ణంరాజు అనే జర్నలిస్టుల వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది. ఈ అంశంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన సోషల్ మీడియాలో ప్రకటించారు. రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాజధాని గురించి, ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. తన సొంత మీడియా చానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవడం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవడం మరింత విచారకరమ హిళల మనోభావాలను గాయపరచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
అంతకు ముందే చంద్రబాబు ఈ అంశంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. సాక్షి టీవీపైనా ఈ అంశంలో చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇవి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వ్యాఖ్యలేనని.. అసలు ఏ మాత్రం అధికారిత లేని ఓ రిపోర్టును అడ్డం పెట్టుకుని ఏపీపై, ఏపీ మహిళలపై నిందలు వేయడాన్ని పోలీసులు కూడా సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.