కోర్టుకు వెళ్లడమే తప్పంటున్న కేటీఆర్..!

“తప్పు చేయకపోతే తప్పుడు పిటిషన్లతో కోర్టుకు ఎందుకు వెళ్తున్నారు..” ఇదీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెట్టిన ట్వీట్. అసలు కేటీఆర్ ఈ వివాదంలో ప్రభుత్వ ప్రతినిధిగా స్పందిస్తున్నారా లేక పార్టీ ప్రతినిధిగా స్పందిస్తున్నారా అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే, అసలు కోర్టులో పిటిషన్లు వేయడమే తప్పన్నట్లుగా చెబుతున్నారు. అవి తప్పుడు పిటిషన్లా, కరెక్ట్ పిటిషన్లా లేకపోతే ఇంకొకటా అన్నది కోర్టులు చెబుతాయి. కానీ అసలు కోర్టుకు వెళ్లడమే తప్పన్నట్లుగా కేటీఆర్ ట్వీట్లు చేస్తూండటంతో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగలేదని, అన్యాయం చేస్తున్నారని భావించే ప్రతి ఒక్కరు న్యాయం కోసం కోర్టుల దగ్గరకు వెళ్తారు. న్యాయవ్యవస్థ ఉన్నదే అందుకు..! కానీ కేటీఆర్ మాత్రం అసలు పిటిషన్లే తప్పుడు అని తేల్చేస్తున్నారు.

ఐటీ గ్రిడ్ అనే కంపెనీ వ్యవహారంపై న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు అటు ఐటీ గ్రిడ్ కంపెనీ ఇటు ఏపీ ప్రభుత్వం, మరో వైపు తెలంగాణ పోలీసులు తమ డేటా చోరీ చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ లోపే కేటీఆర్ కోర్టుల్లో పిటిషన్లు వేయడం తప్పన్నట్లుగా ట్వీట్ చేశారు. ఆది, సోమవారాలు కోర్టులకు సెలవు కావడంతో శనివారం కోర్టు గడవు ముగిసిన తర్వాత పోలీసులు ఐటీ గ్రిడ్ కంపెనీపై దాడి చేసి నలుగురు ఉద్యోగుల్ని తీసుకెళ్లిపోయారు. ఆ నలుగురి కోసం ఆ కంపెనీ యజమాని అశోక్ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో తెల్ల కాగితాలపై వీఆర్‌వో సంతకాలతో పోలీసులు అడ్డంగా బుక్కయిపోయారు. వారిలో దురుద్దేశం ఉందని హైకోర్టు స్పష్టంగా అభిప్రాయపడింది.

ఐటీ గ్రిడ్ కేసు విషయంలో న్యాయనిపుణులు అనేక రకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కేసు తెలంగాణలో నమోదు చేయడానికి అవకాశమే లేదని చెబుతున్నారు. దానికి సంబంధించి స్పష్టమైన చట్టాలు ఉన్నాయని చెబుతున్నారు. అసలు డేటా చోరీ జరిగిందని నిర్దారించడానికి ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, ఏపీ డేటా చోరీ జరిగిందని చెప్పడమే న్యాయసూత్రాలకు అతకదని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఐటీ గ్రిడ్ సంస్థ, ఏపీ ప్రభుత్వం, టీడీపీ న్యాయపోరాటం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో కోర్టులో పిటిషన్లు వేయడం తప్పన్నట్లుగా, ఆ పిటిషన్లు తప్పుడు పిటిషన్లు అన్నట్లుగా కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. కేటీఆర్ మాటలు టీడీపీ వర్గాలకు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close