ఏపీ రైతులకు పెట్టుబడి … చంద్రబాబుకు ఓట్ల రాబడి..!

రైతులకు నేరుగా నగదు పంపిణీ చేసే… పెట్టుబడి సాయం పథకాన్ని .. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అమలు చేయడానికి చంద్రబాబు విధివిధానాలు రూపొందించారు. సాగు చేసే రైతులందరికీ.. సాయం అందేలా… పక్కా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఈ నెల ఇరవై ఒకటో తేదీన మంత్రివర్గ సమావేశంలో దీనిపై.. నిర్ణయం తీసుకుని.. వెంటనే.. ఒక విడత డబ్బులు పంపిణీ చేసేస్తారని కూడా చెబుతున్నారు. ఎన్నికల ప్రకటన రాక ముందే.. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం… ఆర్థిక వనరుల సమీకరణపైనా దృష్టి పెట్టింది. ఇప్పటికే బ్యాంకుల వద్ద నుంచి రుణాలను సమీకరించి.. రుణమాఫీకి పెండింగ్‌లో ఉన్న రెండు విడతల సొమ్మును చెల్లించడానికి ఏర్పాట్లు చేసింది. వాటితో పాటు కొత్తగా.. పెట్టుబడి సాయం ప్రకటించే అవకాశం ఉంది.

సంక్షేమ రంగం ఇప్పుడు రూపు మారిపోయింది. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం చూసుకోవడం అంటే… వారికి నేరుగా డబ్బులు పంచడం అన్నట్లుగా అయిపోయింది. ఇలా చేయడం వల్ల లబ్దిదారులు నేరుగా ప్రభుత్వానికే ఓటేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో అదే జరిగింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. మిగతా ఎన్నికల హామీల కన్నా.. వివిధ వర్గాలకు ఎక్కువగా నేరుగా.. లాభం చేకూర్చే పథకాలకు… రూపకల్పన చేశారు. పెట్టుబడి సాయం, గొర్రెల పంపిణి ఈ కోవలోకే వస్తాయి. తెలంగాణలో కేసీఆర్ విజయం… దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. పలు రాష్ట్రాలు రైతు బంధు తరహా పథకాలు ప్రవేశ పెట్టాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఏపీ కూడా చేరే అవకాశం కనిపిస్తోంది. ఏపీ పథకంలోని లోపాలను సవరించి.. కౌలు రైతులకు కూడా ఇవ్వాలనుకుంటున్నారు.

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వమే.. రైతుల కోసం ఏదో చేయాలని ఆలోచిస్తోంది. కానీ.. ఏం చేయాలన్నదానిపై కేంద్రానికి క్లారిటీ లేదు. ఎలాగోలా.. రైతు బంధు తరహాలోనే ఓ పథకం పెట్టి..నేరుగా రైతుల అకౌంట్లలో కొంత డబ్బులు వేస్తే.. ఎలాగోలా… వారికి కేంద్రంపై ఉన్న ఆగ్రహం చల్లారుతుందన్న ఆలోచన బీజేపీ అగ్రనేతల్లో ఉంది. దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో కానీ.. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రకటించేస్తున్నాయి. ఒక వేళ కేంద్రం పథకం ప్రకటిస్తే.. అమలు చేయాల్సింది రాష్ట్రాలే కాబట్టి… రాష్ట్రాలు భారం తప్పించుకునే అవకాశం ఉంది. అది కేంద్రంపై పడొచ్చు. ఈ ఉద్దేశంతోనే అన్ని రాష్ట్రాలు… రైతులకు కొత్త పథకాలు పెడుతున్నాయన్న అభిప్రాయం కూడా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close