తెలకపల్లి రవి : చంద్రబాబు అప్పుడు ,, జగన్‌ ఇప్పుడు..

గత చాలా ఏళ్లుగా తెలుగు నాట రాజకీయాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతున్నది. ప్రభుత్వాలు ఇబ్బందులలో వున్నా ప్రతిపక్షాలు దాన్నుంచి ఏ మాత్రం ప్రయోజనం పొందలేకపోవడమే దాని సారాంశం. ఇప్పుడు జగన్‌ ఆ పరిస్థితిలోనే వున్నారు. ప్రజలను కదిలించి ఉద్యమాల్లోకి నడిపించలేకపోవడం వల్ల ప్రతిపక్షాలు అస్తిత్వ రక్షణకే ఆరాటపడవలసి వస్తుంటుంది.

చంద్రబాబు నాయుడు హయాంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్లి సమస్యలు లేవనెత్తుతూ ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిగానే ప్రతిష్టితులైనారు. సంఖ్య రీత్యా ఇప్పుడు జగన్‌ అంతకన్నా ఒకింత అధికంగా వున్నా ఆ వ్యూహం ఆ ప్రజా కోణం గోచరించడం లేదు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో తెలుగు దేశం రెండు సార్లు ఓడిపోయింది. ఆయన మరణానంతరం కాంగ్రెస్‌ చెప్పలేనంత దారుణమైన రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. జగన్‌ బలంగా సవాలు చేశారు.కాని తెలుగు దేశం ఆయన గురించి కాంగ్రెస్‌ కన్నా ఎక్కువ జాగ్రత్త తీసుకుంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతమైంది. ప్రభుత్వం నామకార్థంగా నడిచింది. అయితే ఆ సమస్య పట్ల ఎలాటి వైఖరి తీసుకోవాలో తేల్చుకోలేక కొంత, జగన్‌ను రాకుండా చేయడమే ప్రధానమనుకోవడం వల్ల కొంత తెలుగుదేశం ఆఖరి వరకూ అంతర్గత సమస్యలతో సతమతమైంది. చివరకు చంద్రబాబు నాయుడు పాదయాత్రలతోనూ నిరాహారదీక్షలతోనూ ఎలాగో బతికించుకోవలసి వచ్చింది.

ఇంత చేసినా తెలంగాణలో టిఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా వస్తే తెలుగుదేశం మనగడకు ఠికాణా లేకుండా పోయింది. జగన్‌ అధికారంలోకి రాలేకపోయినా దీటైన ఏకైక ప్రతిపక్షంగా గణనీయంగా సీట్లు ఇంచుమించుగా ఓట్లు తెచ్చుకోగలిగారు. కాని ఓదార్పులు పరామర్శలు వ్యక్తిగత పర్యటనలు తప్ప ప్రజలను కదిలించడం ఆయనకు పెద్దగా పట్టదు. అందుకోసం వనరులు కేటాయించడానికి సిద్ధం కారు. కార్పొరేట్‌ తరహాలో క్యాలికులేటెడ్‌గా అడుగులు వేస్తుంటారు. ముఖ్యమంత్రిని కాలేకపోయాననే వాస్తవాన్ని ఆయన ఒక్కనాటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడో అప్పుడో ఆ స్థానంలోకి వస్తాననే వూహించుకుంటున్నారు. అందుకే ప్రభుత్వంలోకి వచ్చాక ఏం చేయాలనేది తప్ప ప్రతిపక్షంగా ఎలా శక్తివంతమైన పాత్ర నిర్వహించాలనేదానిపై ఆయనకు స్పష్టత లేదు. ఇష్టత కూడా లేదు. తన బలం చాలు గనక ఎవరికోసం ఎందుకు పాకులాడాలనుకుంటారు. మరో సమస్య అన్ని పాలక పార్టీలకూ వున్నదే ఆయనకూ వుంది. తాత్కాలికంగా వ్యతిరేకించడం తప్ప రేపు తను వచ్చినా ఈ వ్యాపారానుకూల విధానాలనే అనుసరించాలి గనక మరీ పెద్ద సమరశీల పోరాటాలు పెంపొందించడం నచ్చదు. ఆ వరవడీ వుండదు.

విభజిత ఆంధ్ర ప్రదేశ్‌లో చాలా సమస్యలున్నాయి. వనరుల కొరత వుంది. ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి కూడా వుంది. రాజధాని నిర్మాణంలో అయోమయం, రైతుల ఇతర స్థానికుల ప్రయోజనాల పరిరక్షణలో జాప్యం సందేహాలు చాలా వున్నాయి. బాక్సయిట్‌ తవ్వకం వంటి సమస్యలున్నాయి. రాయలసీమలో ఉద్యమాలు వస్తున్నాయి. కాల్‌మనీ నుంచి అగ్రిగోల్డ్‌ వరకూ అనేక సమస్యలు సంచలనం కలిగించాయి. అయితే వీటిపై రాజకీయ విమర్శలు తప్ప ఒక పరిధి మించి ముందుకుపోగల స్థితిలో వైసీపీ వుండదు. వాటిలో వారి నాయకులు కూడా కొందరు వుండటం, భూముల సేకరణలోనూ వారి పేర్లు వినిపించడం, గతంలో చేసిన పనులూ అన్నిటినీ మించి అపరిష్క్రతంగా వున్న కేసులూ వైసీపీకి పగ్గం వేస్తుంటాయి. కిరణ్‌ కుమార్‌ హయాంలో చంద్రబాబు చేతులు కట్టేసుకున్నట్టే ఇప్పుడు జగన్‌ కూడా తనకు తాను గీసుకున్న గీతలలోనే సంచరిస్తుంటారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్‌ వాదులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఖాతరు చేయనట్టు వ్యవహరిస్తుంటుంది.

ఇక ఇప్పుడు వైసీపీ ఎంఎల్‌ఎల వలస కూడా మొదలవడం పరిస్థితిని ఇంకా దిగజారుస్తుంది. తెలంగాణలో తనవారిని చేర్చుకుంటే విమర్శించిన తెలుగుదేశం ఎపిలో అదే పని చేయడం హేయమే. కాని వారిని నిలబెట్టుకోలేకపోవడంలో జగన్‌ పాత్రకూడా వుంది. ఈ ఘటనల తర్వాతనైనా ప్రధాన ప్రతిపక్షం ప్రజలను కదిలించేందుకు పార్టీని క్రియాశీలం చేసేందుకు చర్యలు తీసుకుంటే బావుంటుంది. అలాగే భేషజాలకు పోకుండా రాష్ట్ర సమస్యలపై ప్రభుత్వంతో సంప్రదించడానికి రాయబారాలు వెళ్లడానికి సిద్ధం కావాలి.ఎంతసేపటికి గవర్నర్‌కే మెమోరాండాలు ఇచ్చి వస్తామంటే సరిపోదు,సరికాదు కూడా. ప్రభుత్వం అఖిలపక్షాలు జరపడం లేదు ప్రతిపక్షమైనా అందరి సలహాలు తీసుకోవడానికి ఎందుకు సిద్ధం కాదు? రెండెద్దులుజోడాయ చేను బీడాయా అన్నట్టు ఈ రెండు పార్టీలు పరస్పరం ఘర్షణ పడుతూ నూతన రాష్ట్ర ప్రయాజనాలపై జరగాల్సిన ఉమ్మడి కృషికి నష్టం చేయడం బాధాకరమైన వాస్తవం. ఫిరాయింపుల వేట ఆపి అందరినీ కలుపుకొని ముందుకు పోవడానికి ప్రభుత్వం చొరవ చూపించాలి. ప్రతిపక్షంగా ప్రజలను కదిలించే పాత్ర వైసీపీ తీసుకోవాలి. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో వున్న బిజెపి కూడా రాష్ట్రానికి న్యాయం చేసి తన గౌరవం నిలబెట్టుకోవాలి. వెంకయ్య నాయుడు పొగడ్తలు సోము వీర్రాజు తెగడ్తల ద్వంద్వ రాజకీయాలు విరమించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close