తెలుగు360 ఎడిటర్స్‌ కామెంట్ : ఢిల్లీలో చంద్రబాబే జగన్ బలం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో చేరడానికి సిద్ధమవుతోందన్నది హాట్ టాపిక్. అంత తప్పు చేయదని కొంత మంది .. మంచి నిర్ణయం అని చాలా మంది విశ్లేషణలు చేస్తూండవచ్చు. అయితే.. మొత్తంగా చూస్తే.. జగన్‌పై.. మొదటి నుంచి ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. అది ఎప్పటి నుండి అంటే.. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నప్పటి నుంటి ఆ సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోంది. ఎంతగా అంటే… జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన వాటిలో.. విమర్శిస్తున్నా.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కేంద్రానికి వ్యతిరేకమవుతుందని తెలిసినా హోదా ఉద్యమాన్ని కొనసాగించినా… బీజేపీ నేతలు.. జగన్‌ను ఆప్యాయంగానే చూశారు. ప్రత్యేకంగా మోడీ, షాలకు జగన్‌పై ఎందుకు ఆప్యాయత ఉంటుంది…?

జగన్‌పైనే మోడీకి మొదటి నుంచి గురి..!

2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజనానంతర ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో.. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. అప్పుడు.. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగానే ఉన్నారు. బీజేపీలోని ఎంతో మంది సీనియర్లు అసంతృప్తిగానే ఒప్పుకున్నారు. ఆయనకు విధాన నిర్ణయాల్లో ఇప్పుడున్నంత ఏకపక్ష నిర్ణయాధికారం లేదు. అమిత్ షా.. గుజరాత్‌లో ఓ సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. అప్పటి అధ్యక్షుడు .. బీజేపీ సీనియర్లు టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యారు. కానీ.. మోడీ మాత్రం.. వైసీపీతో పొత్తుకు వెళ్లాలని సూచించినట్లుగా అప్పట్లోనే ప్రచారం జరిగింది. బీజేపీ గెలుపు ఖాయమన్న ప్రచారం కూడా జరుగుతున్న సమయంలో… తన వెనుక ఉన్న లగేజీ ఇబ్బందుల కారణంగా..జగన్మోహన్ రెడ్డి ఈ పొత్తుక ప్రతిపాదన తన ముందుకు వస్తే అంగీకరించి ఉండేవారేమో కానీ.. చంద్రబాబు అక్కడి వరకూ వెళ్లనీయలేదు. తర్వాత జరగాల్సింది జరిగింది. కానీ ఇక్కడ తెలియాల్సిన విషయమేమిటంటే… మోడీ .. మొదటి నుంచి టీడీపీతో.. చంద్రబాబుతో పొత్తుకు అంత సుముఖంగా లేరు. దానికి తగ్గట్లుగానే ఆయన బీజేపీలో తిరుగులేని నేత అయిన తర్వాత.. చంద్రబాబుకు నిరాదరణ ఎదురయింది. ఎంతగా అంటే.. కూటమిలో ఉన్నప్పటికీ చంద్రబాబు కన్నా విజయసాయిరెడ్డికే మోడీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. కనీసం అపాయింట్‌మెంట్లు కూడా ఇవ్వలేదు. చివరికి పొమ్మనకుండా పొగ పెట్టారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు బయటకు వచ్చి పోరాడాల్సిన పరిస్థితిలోకి వచ్చేశారు.

తాము దెబ్బతిన్నా వైసీపీనే సమర్థిస్తున్న బీజేపీ పెద్దలు..!

” మేమూ.. వైసీపీ ఒకటే అనుకున్నారు. అందుకే మా ఓటు బ్యాంక్ కూడా వైసీపీకే ఓట్లు వేశారు..” ఇదీ సాధారణ ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు రావడానికి కారణంపై…బీజేపీఎమ్మెల్సీ మాధవ్ చేసిన విశ్లేషణ. ఇందులో ఇసుమంత కూడా.. అవాస్తవం లేదు. బీజేపీకి సిద్ధాంత పరంగా.. రెండు శాతమో.. మూడు శాతమో.. ఖచ్చితంగా ఓటు బ్యాంక్ ఉంటుంది. మోడీ క్రేజ్ ఉండనే ఉంటుంది. కానీ.. ఎన్నికల్లో అరశాతం కూడా ఓట్లు రాలేదు. వైసీపీ కోసం.. బీజేపీ నేతలు ఎంతగా ఆరాటపడ్డారో…ఈ ఫలితాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే.. చంద్రబాబును దెబ్బకొట్టాలనే ప్రయత్నం చేశారు.. వైసీపీ లాభపడాలని సర్వశక్తులు ఒడ్డారు కానీ.. తమ పార్టీ మెరుగుపడాలని కోరుకోలేదు. పొత్తు పెట్టుకుని ఓ పది సీట్లు అయినా ఇస్తారనుకుంటే అదీ లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి ఎజెండా వేరుగా ఉంటుంది. ఆయనకు నిర్ణయాత్మకమైన సీట్లు వస్తే.. ఆయన ప్రవర్తన అనూహ్యంగా ఉంటుంది. ఆ విషయం బీజేపీ పెద్దలు అంచనా వేయక కాదు. అయినప్పటికీ.. బీజేపీ పెద్దలు జగన్ పట్ల సానూభూతి చూపిస్తూనే ఉన్నారు.

చంద్రబాబును దెబ్బతీయాలంటే తానే సరైన వాడ్నని మోడీ, షాలను నమ్మిస్తున్న జగన్..!

జగన్మోహన్ రెడ్డిని చేరదీయడం వల్ల తమపై అవినీతి ముద్ర పడుతుందని… తెలిసినా బీజేపీ నేతలు.. ఏ మాత్రం ఆలోచించడం లేదు. కొన్ని వేల కోట్లు క్విడ్ ప్రో కో తరహాలో అవినీతి చేసి.. కోర్టులు తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఉన్న కేసుల్లో ఉన్న నేతను.. దగ్గరకు తీసుకుంటే.. అవినీతిపై పోరాటం చేస్తున్నట్లుగా ప్రకటించుకుంటున్న తమ మాటలకు.. విశ్వసనీయత పోతుందని.. తెలిసినా తగ్గడం లేదు. దీనికి వైసీపీ వ్యూహం కూడా ఓ కారణమే. చంద్రబాబు రాజకీయంగా బలపడితే.. అది వైసీపీతో పాటు అంతిమంగా బీజేపీకి నష్టం చేకూరుస్తుందన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ నాయకత్వంలో కల్పింగలిగారు వైసీపీ నేతలు. చంద్రబాబు మంచి వక్త కాకున్నా.. ఆయన చర్చలతో ఎవరినైనా ఒప్పించగల ఘనాపాటి. నాడు బిల్ గేట్స్ ను హైదరాబాద్‌కు రప్పించడం దగ్గర్నుంచి.. ఆ తర్వాత వాజ్‌పేయి, గుజ్రాల్, దేవేగౌడ ప్రభుత్వాల ఏర్పాటు .. మొన్నటి ఎన్నికల్లో అన్ని పార్టీలను ఒకే తాటి మీద తెచ్చేందుకు జరిగిన ప్రయత్నాలతో ఈ విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వంలోనూ క్లారిటీ ఉంది. ఆయన ఫాం అలా కొనసాగితే.. అంతిమంగా ఢిల్లీ రాజకీయాలపై తనదైన ముద్ర చూపిస్తారని.. అలా చేయకుండా ఉండాలంటే.. ఆయనను సొంత రాష్ట్రంలోనే రాజకీయంగా దెబ్బకొట్టాలని.. దానికి తానే.. సరైన నేతనని.. జగన్ …బీజేపీ పెద్దల్ని నమ్మించగలిగారు. మోడీ, అమిత్ షాలో కూడా ఈ అభిప్రాయం ఉంది. అందుకే.. జగన్మోహన్ రెడ్డి…, బీజేపీపై వ్యతిరేకత పెంచాలా.. బయట వ్యాఖ్యలు చేస్తున్నా.. బీజేపీ నేతలు ఏమీ మాట్లాడటం లేదు.

చంద్రబాబు స్ట్రాంగ్‌గానే ఉన్నారని ఢిల్లీకి సంకేతాలు పంపుతున్నదీ జగనే..!

చంద్రబాబు పని అయిపోయిందని…. ఇప్పటికీ బీజేపీ నేతలు నమ్మడం లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ అభిప్రాయాన్ని బీజే్పీ పెద్దల్ని కల్పించడానికి ప్రయత్నించడం లేదు. ఒక వేళ నిజంగా.. చంద్రబాబు వయసయిపోయిందనో.. లేక ఆయన ఇక పార్టీని గట్టెక్కించలేరనో అభిప్రాయానికి వస్తే.. అప్పుడు.. బీజేపీ.. మొదటగా టార్గెట్ పెట్టుకునేది..వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఈ విషయంలో.. ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండవు. అందుకే.. చంద్రబాబు ఇంకా ధీటుగా ఉన్నారని.. ఆయనను ఎదుర్కోవాలంటే.. కష్టపడాల్సిందే అన్న కవరింగ్‌కు.. జగన్మోహన్ రెడ్డి… మోడీ, షాలకు పంపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు.. తొమ్మిది నెలల్లోనే.. జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితి ఏర్పడటం.. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు ఎజెండాగా ఉంటే.. ఇప్పుడు కక్ష సాధింపే ప్రజల కళ్ల ముందు కనబడటంతో.. హోరాహోరీగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి 151 సీట్లతో అధికారం చేపట్టిన ఏ పార్టీ .. ఇలాంటి పరిస్థితుల్ని కోరుకోలేదు. కనీసం మూడు, నాలుగేళ్లు ప్రశాంతంగా పాలన చేయాలనుకుంటుంది. కానీ చంద్రబాబును హైలెట్ చేసేందుకు వైసీపీ… తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బీజేపీ వద్ద … చంద్రబాబును బూచిగా చూపించడమే జగ‌న్ ఇదంతా చేస్తున్నారు.

ఢిల్లీ వైపు చంద్రబాబు రాకుండా చేయడమే బీజేపీ లక్ష్యం..! జగనే అస్త్రం..!

ప్రభుత్వాలకు ప్రజావ్యతిరేకత అనేది సర్వసాధారణం. ఇప్పుడు ప్రజల్లో ఆలోచనా స్థాయి కూడా మారుతోంది. పదేళ్ల పాటు ఓ ప్రభుత్వం అధికారంలో ఉందంటే.. మొహం మెత్తడం ఖాయం. ఇప్పుడు.. బీజేపీ కి ఆ స్టేజ్ ప్రారంభమయిందని..రాష్ట్రాల ఎన్నికల్లో నిరూపిస్తున్నాయి. మోడీకి ప్రత్యామ్నాయ నేత లేకపోవడం వల్ల గత ఎన్నికల్లో విపక్షాలకు మైనస్ అయింది. వచ్చే ఎన్నికల నాటికి ఆ పరిస్థితి మారే అవకాశాలున్నాయి. అప్పుడు కూడా.. చంద్రబాబును లేవకుండా చేయాలంటే.. తానే సరైన వాడ్నని.. జగన్ బీజేపీ హైకమాండ్‌ను నమ్మిస్తున్నారు. వారు నమ్ముతున్నారు. ఫలితమే.. వైసీపీపై బీజేపీ పెద్దల సానుభూతి. తాను మళ్లీ కోలుకున్నా… బీజేపీకి బద్దశత్రువునేం కాదని.. చెప్పుకునేందుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారు. కానీ చంద్రబాబు.. పరిస్థితులకు తగ్గట్లుగా మారిపోయే అచ్చమైన రాజకీయ నేత. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం… ఆ చాయిస్ లేదు. ఆయన వెనుక లగేజీ ఉంది. అందుకే.. చంద్రబాబు కన్నా జగనే బెటర్ అని బీజేపీ హైకమాండ్ అనుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close