డిఫెన్స్‌ మోడ్‌ నుంచి దూకుడుకి చేంజ్..! చంద్రబాబులో ఈ మార్పు ఎలా..?

బీఫాం సమర్పణకు మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు..!. అయినా అభ్యర్థులెవరో తెలియదు. ఆశావహులందర్నీ… నామినేషన్ల పత్రాలతో రెడీగా ఉండాలని సమాచారం వస్తుంది. అందరూ పసుపు చొక్కాలేసుకుని నామినేషన్ పత్రాలతో.. రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం దగ్గర పడిగాపులు పడుతూంటారు. టైం అయిపోతూ ఉంటుంది.. టైం రెండున్నర దాటిన తర్వాత హైకమాండ్ నుంచి బీఫాం తీసుకుని ప్రత్యేక దూత వస్తాడు. ఆ ఫామ్‌లో ఎవరి పేరు ఉంటే.. వారు పార్టీ అధికారిక అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు..!… ఇదీ.. ఎన్నికలు వచ్చాయంటే.. తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా కనిపించే సీన్. కానీ చంద్రబాబు ఈ సారి సీన్ మార్చారు. నోటిఫికేషన్ రాకముందే ఏకంగా 126 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. మిషన్ 150 అనే కాన్ఫిడెన్స్ ప్రదర్శించారు.

నాన్చడమే చంద్రబాబు శైలి..! కానీ ఇప్పుడు కాదు..!

అభ్యర్థుల జాబితాను… చంద్రబాబు.. ప్రకటిస్తారంటే.. ఎవరూ నమ్మలేదు. గతంలో చాలా సార్లు ఇదే మాట చెప్పారు కదా అని లైట్ తీసుకున్నారు. కానీ గురువారం రాత్రి పదకొండు గంటలకు.. ఒక్కసారిగా.. 126 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటించేయడంతో… అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. పైగా ఇందులో.. చాలా క్లిష్టమైన నియోజకవర్గాలున్నాయి. అభ్యంతరాలున్నాయి. కానీ.. అందరి మాటలు విని.. తన నిర్ణయం మాత్రం తాను తీసుకున్నారు. దీనిపై పార్టీ నేతలు.. కూడా… ఆశ్చర్యానికి గురయ్యారు. నిజానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకూ.. అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేసుకున్నారు. బలమైన అభ్యర్థులు వస్తే.. ఓ పది స్థానాల్లో చాన్సివ్వాలనుకున్నారు. ఆయా స్థానాల ప్రకటన మాత్రం నిలిపివేశారు. కొన్ని చోట్ల..లోక్‌సభ అభ్యర్థులతో మ్యాచ్‌ కావాలి కాబట్టి.. సమీకరణాల కోసం పెండింగ్‌లో పెట్టారంటున్నారు. దీనిపై కూడా..ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారని చెబుతున్నారు.

ఆ ఆభద్రత, అతి జాగ్రత్త ఇప్పుడేమయ్యాయి…?

మామూలుగా చంద్రబాబునాయుడు… పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క అంశంపైనా స్పష్టమైన అవగాహనతో ఉంటారు. ఆయనకు ఆ నెట్‌వర్క్ ఉంది. అయినప్పటికీ… నిర్ణయం తీసుకోరు. చివరి నిమిషం వరకు ఆగుతారు. ముందుగా నిర్ణయం ప్రకటిస్తే… అసంతృప్తులు పెరిగిపోతారేమో… పార్టీకి నష్టం జరుగుతుందేమోనని.. అంచనా ఓ వైపు.. మరో వైపు.. ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటిస్తే.. వారు ప్రత్యర్థి పార్టీ ప్రలోభాలకు లొంగిపోతారేమోననే ఆందోళన మరో వైపు ఉండేది. కానీ ఇప్పుడు వాటిని పూర్తిగా పక్కన పెట్టేశారు. అదే సమయంలో.. ప్రత్యర్థి పార్టీ జాబితా కోసం ఎదురు చూసేవారు. కానీ ఈ సారి మాత్రం ఇతర పార్టీల గురించి.. ఇతర భయాలు.. ఆభద్రత గురించి పట్టించుకోలేదు. జాబితా ప్రకటించేశారు.

గెలుపుపై అంత నమ్మకం వచ్చిందా..?

గత ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు. ఆయనకు అనువైన నియోజకవర్గం కోసం… జల్లెడ పట్టారు. దాని కోసం ఆయన చాలా కేర్ తీసుకున్నారు. చివరికి నామినేషన్ల గడువు దగ్గర పడే సమయంలోనే.. హిందపురం ఖరారు చేశారు. అది టీడీపీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇంత వరకూ.. ఆ నియోజకవర్గంలో వేరే జెండా ఎగరలేదు. అలాంటి నియోజకవర్గాన్ని ఎంపిక చేయడానికి కూడా.. ఎంతో కసరత్తు చేశారు. కానీ.. లోకేష్ విషయంలో మాత్రం.. మంగళగిరిని ఎంపిక చేశారు. మంగళగిరి టీడీపీ కంచుకోట ఏమీ కాదు. 1985 తర్వాత అక్కడ టీడీపీ గెలవలేదు. అంత కంటే ముఖ్యం.. ఆ స్థానంలో పోటీ చేయలేదు. మిత్రపక్షాలకు ఇచ్చేసేవారు. గత ఎన్నికల్లో మాత్రమే పోటీ చేసింది. కానీ ఓడిపోయింది. అలాంటి నియోజకవర్గాన్ని కుమారుడికి ఎంపిక చేశారు. ఎలాంటి చర్చోపచర్చలు పెట్టుకోలేదు.

డిఫెన్స్ మోడ్ నుంచి దూకుడుకి స్టాన్స్ షిఫ్ట్..!

జోరుమీదున్న బ్యాట్స్‌మెన్… డిఫెన్స్ ఆడటానికి ఇష్టపడరు. స్టాన్స్ మార్చి.. ఫ్రంట్ పుట్‌మీదకు వచ్చేస్తారు. చంద్రబాబు జోరు ఇప్పుడు అంతే ఉంది. చకచకా నిర్ణయాలు తీసుకుని రంగంలోకి దిగుతున్నారు. ఐదేళ్ల పాటు తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో… ప్రజల్లో వచ్చిన సానుకూలతే.. ఆయన తాను ఫామ్‌లో ఉన్నాననే నమ్మకంతో ఉన్నారు. అందుకే.. ఈ దూకుడు. మరి తుదికంటా.. ఈ ఫామ్ కొనసాగిస్తారా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close