‘న్యాయ నగరం’…చంద్రబాబు అంతులేని కామెడీ కథ

ముఖ్యమంత్రి కుర్చీకి పదేళ్ళు దూరంగా ఉన్న చంద్రబాబు ఎలా అయినా అధికారంలోకి రావాలన్న ఉద్ధేశ్యంతో 2014 ఎన్నికల ప్రచారంలో అలవిగాని హామీలు ఇచ్చేశారు. సగం కాలం పూర్తయ్యే దశకు వచ్చినా కూడా ఇప్పటి వరకూ పూర్తిగా నెరవేరినా హామీ ఒక్కటి కూడా లేదు. ఆ విషయం ప్రజలకు తెలియకుండా ఉండడం కోసం చంద్రబాబు ఒక అద్భుత మార్గాన్ని కనిపెట్టేసుకున్నారు. 2014 ఎన్నికల్లో ఏ హామీల, వాగ్ధానాల వర్షం అయితే తనకు అధికారం కట్టబెట్టిందో ఆ గాలిలో మేడలు కట్టే మాటల మాయను కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యాడు. గత రెెండున్నరేళ్ళుగా ఆ యజ్ఙాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నాడు చంద్రబాబు.

ఏదైనా ఒక స్పోర్ట్స్ ఈవెంట్‌కి వెళితే అమరావతిలో ఒలింపిక్స్ నగరం నిర్మిస్తానంటాడు. అందులో కూడా క్రికెట్‌ ఈవెంట్ అయితే జిల్లాకో క్రికెట్ నగరానికో స్టేడియం అంటాడు. బ్యాడ్మింటన్ ఈవెంట్‌కి వెళితే బ్యాడ్మింటన్ హబ్‌గా అమరావతి అంటాడు. అలాగే సినిమా ఈవెంట్‌కి వెళితే అమరావతిలో హాలీవుడ్‌ని తలదన్నే స్థాయి ఫిల్మ్ సిటీ అంటాడు. ఇక ఈ సిటీలతో పాటు ఫార్మా సిటీ, సాఫ్ట్‌వేర్ హబ్, విద్యా నగరం……ఇలా ఎప్పుడు ఏ ఈవెంట్‌కి ఆ నగరాన్ని నిర్మించేస్తా అని చెప్పేస్తూ ఉన్నాడు చంద్రబాబు. తాజాగా విశాఖపట్టణంలో నిర్వహించిన దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు అక్కడ కూడా సేం టు సేం తన స్టైల్‌లో అమరావతిలో జస్టిస్ సిటీని నిర్మించేస్తానని హామీ ఇచ్చేశాడు. రాను రాను చంద్రబాబు హామీల వర్షం మరీ కామెడీ అయిపోతోంది. రెండున్నరేళ్ళుగా చంద్రబాబు చెప్తూ వస్తున్న నగరాలలో ఒక్క నగరానికి కూడా పునాదులు పడలేదు. కనీసం ప్లానింగ్ దశలో కూడా ఏవీ లేవు. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నాటి నుంచి రాష్ట్రానికి హై కోర్ట్ తీసుకొచ్చేస్తామని చెప్తున్న వాళ్ళు ఆ దిశగా సాధించింది ఏమీలేదు. కనీసం చంద్రబాబు పదవీకాలం అయిపోయేలోపు అయినా ఆంధ్రప్రదేశ్ జనాలకు హైకోర్ట్ అందుబాటులోకి వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వసతి చూపించడం లేదని అందుకే హైకోర్ట్ తరలింపు ఆలస్యమవుతోందని కేంద్రవర్గాలు చెప్తున్నాయి. హైకోర్ట్ కోసం ఒక భవనాన్ని నిర్మించి ఇవ్వలేని చంద్రబాబు ఏకంగా న్యాయనగరాన్నే నిర్మించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గిఫ్ట్‌గా ఇచ్చేస్తానంటే కనీసం ఆయన భక్తులకు, అనుకూల మీడియాకు కూడా నమ్మశక్యంగా అనిపించినట్టులేదు. ఇక మామూలు జనాలు మాత్రం చంద్రబాబు అంతులేని కామెడీ హామీల కథలు వింటూ నవ్వుకుంటున్నారన్న మాట వాస్తవం. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లెక్కలు అవగాహన ఉన్నవాళ్ళందరూ కూడా చంద్రబాబుకు ఒక సలహా ఇస్తే బాగుంటుందేమో. ఇప్పటి వరకూ ఇచ్చిన హామీలు నెరవెర్చడం గురించి ముందు ఆలోచించండి బాబూ…అవి పూర్తి అయ్యాక కొత్త కొత్త హామీల గురించి ఆలోచిద్దురుగానీ అని చెప్తే బాగుంటుంది. రీసెంట్‌గా వందల కోట్ల రూపాయల ప్రజా సొమ్మును వెచ్చించి తన సొంత ప్రచారం కోసం నియమించుకున్న జర్నలిస్టులు అయినా చంద్రబాబుకు కాస్త మంచి సలహాలిస్తారేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close