చంద్రబాబు లాస్ట్ మినిట్ సిక్స్..! కోటి మంది మహిళలు, 30 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బు..!

పోలింగ్‌కు మూడు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించలేని దెబ్బకొట్టింది. రాష్ట్రంలో దాదాపుగా కోటి మంది ఉన్న డ్వాక్రా మహిళలకు.. ఒక్కొక్కరికి రూ. నాలుగు వేలు అందేలా చేసింది. వారి అకౌంట్లలో శనివారమే నగదు జమ చేసింది. వారంతా… ఇవాళ నుంచి..బ్యాంకుల నుంచి డ్రా చేసుకోవడం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా.. ఉన్న బ్యాంకు శాఖల వద్ద.. ముఖ్యంగా.. పొదులు మహిళా గ్రూపుల ఖాతాలు ఉన్న బ్యాంకుల మహిళల క్యూలు పెద్ద ఎత్తున కనిపించాయి. పోలింగ్ తేదీ లోపు అందరూ నగదు తీసుకునేలా… టీడీపీ శ్రేణులు కూడా.. ఆయా డ్వాక్రా మహిళలను తొందర పెడుతున్నాయి. ఇప్పటికే.. పసుపు – కుంకుమ కింద… రెండు విడతలుగా ఆరువేలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. మూడో విడతగా రూ. నాలుగు వేలు మంజూరు చేసింది. ఈ పథకాన్ని… ప్రతీ ఏటా కొనసాగిస్తామని.. ఏడాదికి రూ. పది వేలు.. డ్వాక్రా మహిళలకు.. ఇస్తామని చంద్రబాబు ఎన్నికల హామీ ఇచ్చారు.

నగదు సాయం పొందుతున్న మహిళల క్యూలు.. టీడీపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. మరో వైపు… రైతు రుణమాఫీ పథకం కింద.. 4వ విడత రుణమాఫీ కోసం రూ.3, 900 కోట్లు విడుదల చేశారు. 30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.39 వేల చొప్పున జమ చేశారు. రైతులు రుణ అర్హత పత్రంతో బ్యాంక్‌కు వెళ్లాలని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సూచించారు. ఐదో విడత కూడా.. ఏడాదికి 10 శాతం వడ్డీతో సహా రైతు రుణమాఫీ పూర్తిగా చెల్లిస్తామన్నారు. ఎన్నికల ఫలితాల కంటే ముందే .. వడ్డీతో సహా తుది విడత బకాయిలు చెల్లిస్తామని ప్రకటించారు. మొత్తం 58.32 లక్షల మంది రైతుల్లో .. 23.76 లక్షల మందికి తొలి విడతలోనే రుణమాఫీ అయిందని.. మిగిలిన వారికి… వచ్చే నెలలో మిగిలిన వాయిదా కూడా పూర్తి చేస్తామన్నారు. ఖరీఫ్‌ లోగా అన్నదాత సుఖీభవ కింద.. ఇవ్వాల్సిన మిగతా అమౌంట్‌ను కూడా రైతుల్లో ఖాతాల్లో వేస్తామని కుటుంబరావు ప్రకటించారు. నేరుగా.. ప్రభుత్వ సొమ్ముతోనే .. టీడీపీ సర్కార్ ఓట్లు కొనుగోలు చేస్తోందనే… విమర్శలు వైసీపీ నేతల నుంచి వస్తున్నాయి. అయితే.. వారి హామీలు కూడా.. అవే కదా.. అని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

వారు అధికారంలోకి వస్తే ఇస్తామంటున్నారు.. మేము అధికారంలో ఉండి.. ఇచ్చేస్తున్నామని అంటున్నారు. డబ్బులు తీసుకున్నవారిలో… ప్రభుత్వంపై కృతజ్ఞతాభావం ఉంటుందని.. కచ్చితంగా తమకే ఓటు వేస్తారని.. టీడీపీ వర్గాలు ఆశ పడుతున్నాయి. కానీ.. ఐదేళ్ల పాలనలో మహిళలు చాలా కష్టాలు పడ్డారని… వారందరూ… డబ్బులు తీసుకున్నా.. తమకే ఓట్లేస్తారని.. వైసీపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close