“భద్రాచలం” ఆంధ్రప్రదేశ్‌దేనా..? చంద్రబాబు కొత్త అస్త్రం..!

పోలవరం ప్రాజెక్ట్ వల్ల.. భద్రాచలం మునిగిపోతుందని… ఆ ప్రాజెక్ట్ ప్రభావాన్ని అంచనా వేసే వరకు.. పోలవరాన్ని నిలిపివేయాలని సుప్రీంకోర్టులో… తెలంగాణ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనికి రాజమండ్రిలో టీడీపీ అధినేత చంద్రబాబు… కౌంటర్ ఇచ్చారు. అసలు భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌దేనని తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు డిమాండ్‌తో ఒక్క సారిగా… రాజకీయ కలకలం ప్రారంభమయింది. నిజానికి 1956కి ముందు అంటే.. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందు… తెలంగాణ … విలీనం జరగక ముందు.. ఆంధ్రప్రదేశ్‌లో.. భద్రాచలం భాగం. అది తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండేది. భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత 1959 లో భద్రాచలం ప్రాంతం ఖమ్మం జిల్లాలో విలీనమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కూడా.. 1956కి ముందు ఉన్న తెలంగాణ కావాలని.. అనేక సార్లు నినదించారు. దాని ప్రకారం చూసినా… భద్రాచలం మొత్తం.. ఏపీకే చెందుతుంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు… పోలవరం ప్రాజెక్ట్ విషయంలో.. కేసీఆర్ చెబుతున్న అభ్యంతరాలకు సరైన కౌంటర్ రెడీ చేసుకున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఆ ఏడు ముంపుమండలాలు మాత్రమే కాదు.. భద్రాచలం కూడా.. 1959కి ముందు… ఆంధ్రప్రదేశ్‌వే. తెలంగాణ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు.. సరిహద్దుల్ని జిల్లాల వారీగా నిర్ణయించారు. కానీ ఖమ్మం జిల్లాలో భద్రాచలం సహా… ఆ ఏడు మండలాలూ… తెలంగాణ కాదు. 1959 తర్వాత ఖమ్మం జిల్లాలో విలీనం చేయడంతో.. అవి తెలంగాణలో భౌగోళికంగా ఉన్నట్లు వాడుకలోకి వచ్చాయి.

మొత్తానికి ఎన్నికల సమయంలో.. హాట్ టాపిక్ అవడానికి.. మరో అంశం… తెరపైకి వచ్చింది. అదే భద్రాద్రి రామయ్య. ఏపీకి చెందిన భూభాగాన్ని తెలంగాణలో కలిపేసుకున్నారన్న ప్రచారం… ఇప్పుడు ఓటర్లపై ప్రభావం చూపుతుంది. అన్నింటికంటే ముఖ్యం.. భద్రాద్రి రామయ్య.. ఆంధ్ర ఆస్తి అన్న సెంటిమెంట్ ప్రజల్లోకి వెళ్తే.. మరింత సెంటిమెంట్ పెరుగుతుంది. పోలవరంపై… కేసీఆర్ చేస్తున్న రాజకీయానికి… ఇదే సరైన కౌంటర్ అని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close