గుజరాతీలతో వ్యవస్థలన్నీ నాశనం..! ఏం చేసినా బిజెపి కి లొంగే ప్రశ్నే లేదు..! : చంద్రబాబు

రాజ్యాంగ వ్యవస్థలతో రేపో, మాపో తనపై దాడులు జరుగుతాయని… అయినప్పటికి.. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన హామీలు అమలు చేయమని అడుగుతూంటే… రాజ్యాంగ వ్యవస్థలతో.. ఏపీ ప్రభుత్వం, టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో .. అన్ని రాజ్యాంగ వ్యవస్థల్లో గుజరాతీలను పెట్టుకుని… వ్యవస్థలను బలహీనం చేసి.. దేశానికి నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. కో ఆపరేటివ్‌ ఫెడరలిజం అమలు చేస్తామని బీజేపీ చెప్పిందని తీరా… ఇప్పుడు మాత్రం పార్టీలను, వ్యవస్థలను బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని కీలక పదవుల్లో మొత్తం గుజరాతీలే ఉన్నారు. తమకు నచ్చనివాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏపీలో అస్థిరత నెలకొనేలా చేస్తున్నారని మండిపడ్డారు.

విమానాశ్రయంలో దాడి ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. జగన్‌పై దాడిలో కేంద్రప్రభుత్వం విఫలమైతే… రాష్ట్రానికేంటి సంబంధమని సూటిగా ప్రశ్నించారు. సీబీఐ వివాదంలో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐలో అధికార కేంద్రాలను మీరు ఎలా ప్రోత్సహిస్తారు?. సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్థానాసహా అనేకమంది గుజరాతీలేనన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవస్థలను నాశనం చేస్తున్నారని.. మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, నియంతృత్వ పాలనలో లేమని గుర్తు చేశారు.

పెద్దనోట్లను రద్దు చేశారు, నేనూ సమర్థించానని.. డిజిటల్ కరెన్సీని ప్రొత్సహించమంటే.. దానికి విరుద్ధంగా రూ.2వేలు, రూ.500 పెద్ద నోట్లు తీసుకొచ్చారని .. ఇప్పటికి కూడా నగదు కొరత కొనసాగుతోందన్నారు. నోట్ల రద్దు సరైన నిర్ణయం కాదని రఘురామరాజన్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బ్యాంకులపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు.. నీరవ్‌మోదీ, విజయ్‌మాల్యా దేశం నుంచి ఎలా పారిపోయారని చంద్రబాబు ప్రశ్నించారు. దేశంలో బ్యాంకులన్నీ దివాలా తీసే పరిస్థితి వచ్చిందని … తుపాను సహాయ కార్యక్రమాలకు ఆర్బీఐ నగదు ఇవ్వలేకపోయిందని.. చంద్రబాబు మండిపడ్డారు. డాలర్‌తో రూపాయి విలువ పతనం ఊహాతీతంగా పెరిగిపోయిందన్నారు. పెట్రో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.. దేశంలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేరని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన హామీలు అమలు చేయాలంటూ 29సార్లు ఢిల్లీ వచ్చా … విభజన చట్టం విషయంలో బీజేపీ నమ్మించి మోసం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీని నష్టపరచాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికకు వైసీపీ మద్దతు తీసుకున్నారు. జగన్‌పై సీబీఐ కేసులున్నాయని గుర్తు చేశారు. అవినీతి పార్టీలకు, అక్రమార్కులకు మద్దతిస్తున్నారని వైసీపీతో బీజేపీ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీ అవినీతిపరుల ట్రాప్‌లో పడ్డారని చంద్రబాబు తేల్చారు. బీజేపీని వ్యతిరేకించే వాళ్లను వేధిస్తున్నారన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు రూ.350కోట్లు ఇచ్చి, వెనక్కి తీసుకున్నారని అలా ఎలా వెనక్కి తీసుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణకు నిధుల విడుదలను నేను సమర్థిస్తున్నానని ఏపీకి నిధులు ఇవ్వకపోవడం వివక్షేనన్నారు. జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి పై కూడా స్పందించారు. దాడి చేసిన వ్యక్తిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని … ఎయిర్ పోర్టులో దాడి జరిగితే.. బీజేపీ నేతలు టీడీపీపై విమర్శలు చేశారని చంద్రబాబు గుర్తు చేసారు. జగన్‌పై దాడి జరగగానే డీజీపీకి గవర్నర్‌ ఫోన్‌ చేశారని.. పాలనలో గవర్నర్‌ జోక్యం చేసుకోవడమేమిటని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతల వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహిస్తున్నారు. బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీల నేతలను… కేసుల పేరుతో వేధిస్తున్నారన్నారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డిసహా అనేక రాష్ట్రాల్లో ఇదే జరుగుతోంది. మేం బీజేపీతో స్నేహం చేసినన్ని రోజులు… మాకు పన్ను ఎగవేత నోటీసులు రాలేదు కానీ.. బీజేపీతో విడిపోగానే 19బృందాలతో ఐటీ దాడులు చేయించారనన్నారు. విభజన చట్టం అమలుపై విబేధించినంత మాత్రాన వేధిస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రేపుమాపో నాపై కూడా దాడులు జరుగుతాయని తెలుసని… 40 ఏళ్లుగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నా .. ఏనాడూ తప్పు చేయలేదన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close